వారిని నిండా ముంచింది బాబేనా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. కొందరి కార‌ణంగా కొంద‌రు నాయ‌కులు, కొన్ని కుటుంబాలు వెలుగులోకి వ‌స్తే.. మ‌రికొంద‌రి కార‌ణంగా అవే కుటుంబాలు చిమ్మ‌చీక‌ట్లోకి నెట్టేయ‌బ‌డ‌డం [more]

Update: 2019-10-27 15:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. కొందరి కార‌ణంగా కొంద‌రు నాయ‌కులు, కొన్ని కుటుంబాలు వెలుగులోకి వ‌స్తే.. మ‌రికొంద‌రి కార‌ణంగా అవే కుటుంబాలు చిమ్మ‌చీక‌ట్లోకి నెట్టేయ‌బ‌డ‌డం కూడా రాజ‌కీయాల్లో జ‌రుగుతుంటుంది. ఇలాంటి కుటుంబమే డీకే ఆదికేశ‌వుల నాయుడు ఫ్యామిలీ. చిత్తూ రు జిల్లా, చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు డీకే ఆదికేశవులునాయుడు. 2004 ఎన్నిక‌ల్లో గెలిచిన ఆ త‌ర్వాత ఆయ‌న 2007లో చంద్ర‌బాబు మీకోసం పాదయాత్ర‌కు ఖ‌ర్చు పెట్టుకున్నారు. అయితే, ఆయ‌న త‌ర్వాత కాలంలో వైఎస్‌కు చేరువ‌య్యారు.దీనికి కూడా కార‌ణం ఉంది. ఆయ‌న చిర‌కాల వాంఛ అయిన టీటీడీ బోర్డు చైర్మన్ అవ్వాల‌ని అనుకున్నారు.

వైఎస్ కు చేరువై…..

ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2004లో అధికారంలో ఉన్న వైఎస్ ప్ర‌భుత్వానికి చేరువ‌య్యారు. యూపీఏ ప్ర‌భుత్వంపై నాడు ప్రతిప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్య‌తిరేకంగా ఓటేసి.. వైఎస్‌కు చేరువ‌య్యారు. నాటి ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆదికేశ‌వులు నాయుడు, మందా జగ‌న్నాథం ఇద్ద‌రూ టీడీపీ ఎంపీలుగా ఉండి పార్టీ ఆదేశాలు ధిక్క‌రించి మ‌రీ వైఎస్‌కు చేరువ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న డీకేకి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు. వైఎస్ మాట కోసం యూపీఏ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఆయ‌న స‌తీమ‌ణి.. స‌త్యప్ర‌భ ఎంట‌ర‌య్యారు.

ఆయన మృతి తర్వాత….

డీకే మ‌ర‌ణం త‌ర్వాత వైఎస్ మృతి చెంద‌డంతో చివ‌ర‌కు డీకే ఫ్యామిలీ తిరిగి టీడీపీ గూటికి చేరింది. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆమెకు చిత్తూరు అసెంబ్లీ సీటు ఇవ్వ‌గా ఆమె ఘ‌న‌విజ‌యం సాధించారు. ఐదేళ్ల‌లో ఆమె పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా రాజ‌కీయంగా పార్టీలోనే తీవ్ర అణిచివేత‌కు గుర‌య్యారు. 2019 ఎన్నిక‌ల నాటికి చంద్రబాబు కూడా స‌త్య‌ప్ర‌భ‌కు షాక్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆమెకు చిత్తూరు సీటు కాకుండా క‌డ‌ప జిల్లా రాజంపేట ఎంపీ సీటును కేటాయించారు. వాస్త‌వానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆమె తిరిగి చిత్తూరులోనే పోటీ చేస్తాన‌న్నా చంద్రబాబు మాత్రం ఆమెకు బ‌ల‌వంతంగా రాజంపేటకు పంపారు. ఆమె మిథున్ రెడ్డిపై ఓట‌మిపాల‌య్యారు.

పోగొట్టుకుంది ఎక్కువే…

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా డీకే సత్యప్రభ రాజ‌కీయాలు దాదాపు స‌న్న‌గిల్లాయ‌నే చెప్పాలి. అంతేకాదు, ఏడాది కింద‌ట డీకే విద్యా సంస్థ‌ల‌పై ఐటీ దాడులు జ‌రిగిన‌ప్పుడు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ఈ విష‌యంలోనూ మౌనం వ‌హించారే త‌ప్ప‌.. ఆ కుటుంబాన్ని క‌నీసం ఆదుకున్న‌ది లేదు. దీంతో దాదాపు ఈ కుటుంబం టీడీపీలో ఉండి పోగొట్టుకున్న‌దే ఎక్కువ త‌ప్పితే.. పొందింది ఏమీలేద‌నే వాద‌న ఉంది. అంతేకాదు, ఈ కుటుంబానికి వైఎస్ లైఫిస్తే.. చంద్రబాబు తెర‌దించేశారనే అభిప్రాయం కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది.

Tags:    

Similar News