పీతల పుంజుకుంటున్నారు
ప్రతిపక్షం టీడీపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కని నాయ కులకు మరోసారి అద్భుతమైన ఛాన్స్ ఇచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం [more]
ప్రతిపక్షం టీడీపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కని నాయ కులకు మరోసారి అద్భుతమైన ఛాన్స్ ఇచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం [more]
ప్రతిపక్షం టీడీపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కని నాయ కులకు మరోసారి అద్భుతమైన ఛాన్స్ ఇచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అనేలా పరిస్థితి మారిపోయింది. దీంతో పార్టీ కేడర్‌లో నైరాశ్యం అలుముకుంది. నాయకుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. ఇప్పుడు పార్టీని మళ్లీ పుంజుకునేలా చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై దృష్టి పెట్టిన చంద్రబాబు త్వరలోనే పార్టీకి మళ్లీ జవసత్వాలు నింపే పనులు ప్రారంభిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలతో….
ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు పార్టీని అభివృద్ధి చేసే క్రమంలో స్థానికంగా పార్టీని పుంజుకునేలా చేయాల్సిన అవసరం టీడీపీపై ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీకి కీలకమైన నాయకులను ఇంచార్జ్‌లుగా నియమించి, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు నియోజకవర్గాల్లో సిట్టింగులను పక్కన పెట్టిన చంద్రబాబు.. కొత్తవారికి అవకాశం ఇచ్చారు.
కొందరు వత్తిడితో….
అయితే, జగన్ సునామీ ముందు వారు నిలబడలేక పోయారు. దీంతో ఓడిపోయారు. ఇలా ఓడిపోయిన వారు పార్టీకి, నియోజకవర్గానికి కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిని పక్కన పెట్టి అంకిత భావంతో పనిచేస్తున్నవారికి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి పీతల సుజాత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో పదవి ఉన్నా లేక పోయినా.. కూడా పీతల సుజాత కమిట్‌మెంట్‌తో ఉన్నారు. గతంలో కొందరు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీలు చెప్పిన మాటలతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పీతల సుజాతకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు.
కర్రా ఇన్ యాక్టివ్ కావడంతో….
ఈ క్రమంలో చింతలపూడి నుంచి కర్రారాజారావును రంగంలోకి దింపారు. 2009లో ఓడిపోయి పలు పార్టీలు మారి తిరిగి టీడీపీలోకి వచ్చిన కర్రాకు సీటు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా కొందరు నేతల ఒత్తిళ్లతో ఆయనకే సీటు ఇచ్చారు. పీతల సుజాతను బలవంతంగా పక్కన పెట్టారు. అయితే, ఆయన ఓడిపోయారు. 33 వేల ఓట్ల భారీ మెజార్టీతో కర్రా ఘోర పరాజయం పాలయ్యారు… ఆ తర్వాత పార్టీకి, నియోజకవర్గానికి కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అసలు అవుట్ డేటెట్ నాయకుడు అయిన కర్రా.. వయోః భారంతో కూడా ఇబ్బంది పడుతున్నారు.
పీతలకే ఇవ్వాలని….
దీంతో కమిట్‌మెంట్‌తో ఉండడంతో పాటు ప్రజల్లో తిరుగుతున్న పీతల సుజాతకే ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. అది కూడా వచ్చే నెలలోగా ఈ ఇంచార్జ్‌ల నియామకం ఉంటుందని, వీరిలో పీతల సుజాత పేరు తొలి జాబితాలోనే ఉంటుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర నాయకులు ఎవరైనా ఆమెకు యాంటీగా పనిచేసినా చంద్రబాబు వినే పరిస్థితి కూడా లేదు. ఇక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పీతల సుజాత నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. దీంతో పీతల సుజాత వర్గం సంబరాల్లో మునిగిపోయింది. మరి బాబు నిర్ణయం ఎలా ? ఉంటుందో చూడాలి.