ఆయనొస్తే మళ్లీ అమరావతేనట ?
రాజధాని వ్యవహారం బొత్తిగా పిల్లాటగా అయిపోయింది. అసలు ఈ రాజకీయ నాయకులను, పార్టీలను అని ఏం ప్రయోజనం. ఏపీ తలరాత అలా ఉందనుకోవాలేమో. లేకపోతే ఈ ప్రపంచంలో [more]
రాజధాని వ్యవహారం బొత్తిగా పిల్లాటగా అయిపోయింది. అసలు ఈ రాజకీయ నాయకులను, పార్టీలను అని ఏం ప్రయోజనం. ఏపీ తలరాత అలా ఉందనుకోవాలేమో. లేకపోతే ఈ ప్రపంచంలో [more]
రాజధాని వ్యవహారం బొత్తిగా పిల్లాటగా అయిపోయింది. అసలు ఈ రాజకీయ నాయకులను, పార్టీలను అని ఏం ప్రయోజనం. ఏపీ తలరాత అలా ఉందనుకోవాలేమో. లేకపోతే ఈ ప్రపంచంలో రాజధాని విషయంలో ఇన్ని రకాల గొడవలు, పిల్లి మొగ్గలు వేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. చూడబోతే ఏపీ వాస్తు మీదనే పెద్ద డౌట్ వస్తోంది. మద్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, ఇపుడు విశాఖ, కర్నూలు ఇలా ఎన్ని రాజధానులైనా ఏపీ మోస్తుంది, భరిస్తుంది. కానీ ఏది కచ్చితం, ఏది శాశ్వతం అన్న దగ్గరే తేడా వస్తోంది.
మూడుతో పాడు అట….
మూడు రాజధానులేంటి, ఎక్కడైనా చూశామా, విడ్డూరం కాకపోతే. ఇదీ తమ్ముళ్ళ మాట. ఇక కొందరు తమ్ముళ్ళు అయితే మరి కాస్తా ముందుకు వెళ్ళి తాము అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతే రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. అంటే కాపిటల్ సిటీ బొత్తిగా కామెడీ పీస్ అయిపోయిందన్న మాట. ఇప్పటికే మూడు రాజధానుల చిచ్చుతో ఏపీ తెగ ఇబ్బంది పడుతూంటే చంద్రబాబు 2024 ఎన్నికల తరువాత పవర్లోకి వస్తే విశాఖ నుంచి అమరావతికి రాజధానిని తరలించుకుపోతారట. అలా ఒక్కటే రాజధానిగా అమరావతిని ఉంచేస్తారుట. చెప్పడానికి ఇది జోక్ కాదు ఫుల్ సీరియస్ మ్యాటరేనని తమ్ముళ్ళు అంటున్నారు. చిన్న పిల్లలు నాది నాది అంటూ బొమ్మ కోసం తగవు ఆడుకుంటున్నట్లుగా చేసి పారేశారు కదా మొత్తానికి ఈ రాజధానుల వ్యవహారం అని బయట జనాలు నవ్విపోతున్నారుగా.
అయ్యే పనేనా…?
రాజ్యాంగం ప్రకారం రాజధానులు ఎన్ని అయినా పెట్టుకునే అధికారం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది నాడు చంద్రబాబు టైంలోనూ ఇపుడు జగన్ టైంలోనూ రుజువు అయింది. రాజధాని అన్నది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది. దానికి కేంద్రంతో అసలు సంబంధం లేదు. ఇక రాజధానులు అంటేనే పోషణ. ఆర్ధికంగా బలంగా ఉంటే ఒక్కో చోట ఒక్కోటి పెట్టి మా రాజధానులు ఇవన్నీ చూపించుకోవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. అంటే రాజ్యాంగం ప్రకారం చూస్తే ఇపుడు తమ్ముళ్ళు అంటున్న మాటలు పూర్తిగా జరిగి తీరుతాయన్న మాట. మరో నాలుగేళ్ల తరువాత బాబొచ్చి అమరావతి మన రాజధాని అంటే అంతా తట్టా బుట్టా సర్దాల్సిందేనన్నమాట.
పోయేది అదేగా …..
ఇక్కడ ఏంటి అంటే రాజకీయంగా రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. వైఎస్సార్, చంద్రబాబుల వ్యక్తిగత వైరం కాస్తా జగన్ తరంలోనూ పదింతలు అయింది. బాబు ఎడ్డెమంటే జగన్ తెడ్డేమంటారు, ఇక జగన్ ఏం చేసినా బాబుకు నచ్చదు, అందువల్ల ఇగోలు, వ్యక్తిగత స్వార్ధాలు అన్నీ కలసి ఇలా రాజధానులతో చెడుగుడు ఆడుకుంటున్నారన్నమాట. అయితే ఇక్కడ అంతా అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతీ రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని అధికారికంగా ఉండాలి. దాన్ని చూపించే బయట కేరాఫ్ అడ్రస్ చెప్పుకునేది. పరిశ్రమలు వచ్చేది. జగన్ కి అలా విశాఖపట్నం ఉండాలనుకుంటే, బాబు అమరావతి అని పంతం పోతున్నారు. మొత్తానికి ఇద్దరు నాయకులు కలసి ఏపీ పరువు తీస్తున్నారు అని మేధావులు అంటున్నారు. అసలు ఏ గొడవ అంతా లేకుండా ఉండాలంటే కొత్త రాష్ట్రాలకు రాజధానులు ఎంపిక చేసే హక్కు అంతా పూర్తిగా కేంద్రానికే ఇచ్చేస్తే పోలా అన్న మాట కూడా వినవస్తోంది.