చంద్రబాబే సక్సెస్.. జగన్ ను ఆపగలిగారు.. హాట్ టాపిక్
వ్యూహాల అమలులో చంద్రబాబును మించిన వారు లేరు. ప్రజల్లో ఇమేజ్ ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను అనుకున్నది జరిగేలా చూసుకుంటారు. [more]
వ్యూహాల అమలులో చంద్రబాబును మించిన వారు లేరు. ప్రజల్లో ఇమేజ్ ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను అనుకున్నది జరిగేలా చూసుకుంటారు. [more]
వ్యూహాల అమలులో చంద్రబాబును మించిన వారు లేరు. ప్రజల్లో ఇమేజ్ ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను అనుకున్నది జరిగేలా చూసుకుంటారు. జగన్ పదిహేను నెలల పాలన చూసిన తర్వాత అయినా చంద్రబాబు వ్యూహాలు గురించి తెలయని వారికి కూడా తెలుస్తుంది. గత పదిహేను నెలల నుంచి జగన్ పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తాను అనుకున్నది గ్రౌండ్ చేయడంలో జగన్ సక్సెస్ కాలేకపోతున్నారు.
బాబు వ్యూహాల కారణంగానే…..
అనేక నిర్ణయాలు చంద్రబాబు వ్యూహాల కారణంగానే జగన్ అమలు పర్చలేకపోయారన్నది వాస్తవం. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని వైసీపీ పదే పదే ఆరోపణలు చేస్తున్నా ఏపీలో పాలన మాత్రం చంద్రబాబు అనుకున్న రీతిలోనే సాగుతుంది. ఒకరకంగా అనధికారికంగా రాష్ట్రాన్ని చంద్రబాబు శాసిస్తున్నారనే చెప్పుకోవాలి. జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పదిహేను నెలలు దాటుతోంది. ఒక్క సంక్షేమ పథకాలను తప్పించి జగన్ ఏ విషయంలో సక్సెస్ అయ్యారో చెప్పాలని టీడీపీ నేతలు నిలదీయడంలో నిజం లేకపోలేదు.
ఏ కేసులు పెట్టినా…..
కరకట్ట మీద చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయడ దగ్గర నుంచి నేడు రాజధాని భూములపై సిట్ విచారణ వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వీటిపై విజయాన్ని సాధించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రమే సక్సెస్ అయ్యారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా న్యాయస్థానాలకు తీసుకెళ్లడం, అక్కడ నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడం వంటి వాటితో జగన్ పాలనకు చంద్రబాబు పరోక్షంగా బ్రేకులు వేస్తున్నారనే చెప్పాలి.
అన్నింటా అడ్డుకుంటుండటంతో…
తనపై వస్తున్న ఆరోపణలపై ఏమాత్రం విచారణ జరపకుండా చంద్రబాబు దిగ్విజయంగా అడ్డుకుంటున్నారు. న్యాయస్థానాల ద్వారా స్టేలు తెచ్చుకుని ప్రభుత్వానికి సవాల్ విసరుతున్నారు. తనను చేయగలిగింది ఏమీ లేదని నర్మగర్భంగానే చెబుతున్నారు. దీంతో జగన్ కొత్త పల్లవిని అందుకున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించాలని నిర్ణయించారు. రాజధాని భూముల్లో అవినీతి, ఫైబర్ గ్రిడ్ అంశాలపై విచారణను సీబీఐ చేత చేయించాలని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ మీద చంద్రబాబు అనేక విషయాల్లో సక్సెస్ అయ్యారన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతుంది.