బాబు పులి జూదం మొదలుపెట్టినట్లుందిగా..?
ఏపీలో ఇపుడు దేవతా విగ్రహాల మీద రాజకీయం సాగుతోంది. ఎవరు ఎందుకు చేస్తున్నారు అన్న సంగతిని పక్కన పెడితే విపక్షాలు ఒక్కటిగా జగన్ సర్కార్ మీద పడి [more]
;
ఏపీలో ఇపుడు దేవతా విగ్రహాల మీద రాజకీయం సాగుతోంది. ఎవరు ఎందుకు చేస్తున్నారు అన్న సంగతిని పక్కన పెడితే విపక్షాలు ఒక్కటిగా జగన్ సర్కార్ మీద పడి [more]
ఏపీలో ఇపుడు దేవతా విగ్రహాల మీద రాజకీయం సాగుతోంది. ఎవరు ఎందుకు చేస్తున్నారు అన్న సంగతిని పక్కన పెడితే విపక్షాలు ఒక్కటిగా జగన్ సర్కార్ మీద పడి చేయాల్సినదంతా చేస్తున్నాయి. ఏపీలో అధికార వియోగంతో విలవిలలాడుతున్న తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని అతి పెద్ద ఇష్యూగా చేస్తోంది. జనంలో జగన్ ని విలన్ గా చేస్తోంది. తాను హిందూ మతోద్ధారకుడిగా చంద్రబాబు ప్రకటించుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చర్చిలు, మసీదులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చంద్రబాబు ప్రశ్నించడంలోని ఆంతర్యం అదే.
అది వర్కౌట్ అవుతుందా…?
ఏపీలో చూసుకుంటే ఇప్పటిదాకా కులాల గొడవలే ఉన్నాయి. మతాల వ్యవహారాలు ఎపుడూ చెల్లలేదు కూడా. ఇక చంద్రబాబు కానీ మరో రాజకీయ పార్టీ కానీ హిందూత్వ అజెండాను ముందేసుకుంటే అది పెద్దగా వర్కౌట్ అయ్యేది లేదని కూడా అంటున్నారు. ఏపీలో మైనారిటీలు అయిన ముస్లింలు, క్రిస్టియన్లు ఇప్పటికే జగన్ తో ఉన్నారు. ఇక హిందువుల ఓట్లన్నీ సంఘటితం కావడం అన్నది అతి కష్టమైన వ్యవహారమే. ఉత్తరాది రాష్ట్రాలో ఉన్న సున్నితమైన భావోద్వేగాలు ఏపీలో అసలు లేవు. అవే కనుక ఉంటే ప్రత్యేక హోదా, విభజన సమయంలోనే ఏపీలో అగ్గి రాజేసేది. ఇక హిందువులు ఒక్కటిగా మారి ఒకే పార్టీకి ఓటు వేయడం అన్నది కూడా ఆచరణలో అమలు కాని విషయమే.
బీజేపీకి మేలా..?
ఇపుడు ఏపీలో ప్రధాన ప్రక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు సెక్యులర్ ముఖం ఉంది. అధికారం పోయింది అన్న బాధలో చంద్రబాబు భారీ రిస్క్ చేస్తున్నారు. హిందూ అజెండాను భుజాన వేసుకుంటున్నారు. దాని వల్ల బీజేపీ అజెండానే ఆయన అమలు చేస్తున్నారు అయితే ఆ పేటెంట్ హక్కులు అన్నీ కూడా బీజేపీకే ఎప్పటికీ ఉంటాయి. హిందూ ఓటింగ్ ఏ మాత్రం పోలరైజ్ అయినా కూడా కమలం పార్టీకే లబ్ది చేకూరుతుంది. అదే సమయంలో చంద్రబాబు అనవసరంగా హిందూ ఓట్ల కోసం వెంపర్లాడుతూ తనకు ఉన్న లౌకిక ముద్రను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అపుడు మైనారిటీల ఓట్లు టీడీపీకి శాశ్వతంగా పోతాయి. అలా రెండింటికీ టీడీపీ చెడ్డ అయ్యే పరిస్థితి ఉంటుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
సింపతీ పెంచుతుందా…?
ఇక ఏపీలో చూసుకుంటే జగన్ ఒక వైపు మొత్తం విపక్షం అంతా మరో వైపు అన్న పొలిటికల్ సీన్ ఉందని అందరికీ తెలుసు. జగన్ని సరిగ్గా ఎదుర్కోలేకనే మత వివాదాలు ముందుకు తెస్తున్నారు అని సగటు ఓటరు గ్రహిస్తే కనుక ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కూడా వెనక్కి పోతాయి. పైగా జగన్ కే అది సానుభూతిని అపారంగా తెచ్చిపెడుతుంది. నిజానికి ఏపీలో అంతా ఒక్కటిగా ఉంటున్నారు. ఈ రకమైన మత విభజనను జనాలు అసలు అంగీకరించరు కూడా. దాంతో చంద్రబాబు రాంగ్ స్టెప్ వేస్తున్నారా అన్న చర్చ సొంత పార్టీలో కూడా ఉంది. సున్నితమైన మతపరమైన అంశాలు ఏవైనా ప్రస్థావనకు వచ్చినపుడు చంద్రబాబు తాను దూరంగా ఉండడమే బెటర్ అన్నది కూడా పార్టీలో భావన. కానీ చంద్రబాబు పులి జూదం ఆడుతున్నారు. అది ఆయనకు ఫలితం తేకపోగా ప్రమాదకరం కూడా అంటున్నారు.