ఆ అపోహ నుంచి బాబు బయటపడితేనే?

చంద్రబాబు నాయుడు దేనినీ తేలిగ్గా వదిలేందుకు సిద్ధపడరు. అదే ఆయన నైజం. ఓటమి ఎదురవుతుందని తెలిసినా చివర వరకూ పోరాడే తత్వం చంద్రబాబుది. మొన్నటి పరిషత్ ఎన్నికలు [more]

Update: 2021-04-23 03:30 GMT

చంద్రబాబు నాయుడు దేనినీ తేలిగ్గా వదిలేందుకు సిద్ధపడరు. అదే ఆయన నైజం. ఓటమి ఎదురవుతుందని తెలిసినా చివర వరకూ పోరాడే తత్వం చంద్రబాబుది. మొన్నటి పరిషత్ ఎన్నికలు మినహా చంద్రబాబు ఏ ఎన్నికల విషయంలోనూ వెనకడుగు వేయలేదు. గత ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామని చంద్రబాబు భావించారు. ఏపీ ప్రజలకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు గట్టిగా నమ్మారు.

జగన్ ను విశ్వసించరని….

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తాను తప్ప మరో దిక్కు లేదనుకున్నారు చంద్రబాబు. అంతేకాదు జగన్ ను ప్రజలు విశ్వసించరని, అవినీతి ఆరోపణలున్న జగన్ వైపు ప్రజలు చూడరని చంద్రబాబు భావించారు. కానీ అక్కడే చంద్రబాబు తక్కువ అంచనా వేశారు. ప్రజలకు అవినీతి అంటే పట్టదని ఫలితాల తర్వాత తెలిసివచ్చింది. పోనీ ఇంత తెలిసొచ్చినా చంద్రబాబు లో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే అదీ లేదు.

మళ్లీ పాత ఆరోపణలే…

మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి నిన్న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం వరకూ చంద్రబాబు జగన్ పై పాత ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. జగన్ అవినీతి పరుడని ముద్రవేస్తే తనవైపునకు మరలుతారన్న భావన నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదనే అనిపిస్తుంది. నిజానికి ఇప్పడు ఎవరిపైనా ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓటర్లు ముందుగానే ఫిక్స్ అవుతున్నారు.

వేరే వారు ఎవరూ లేరనుకుంటే..?

దీంతో పాటు తను తప్ప వేరే వారెవ్వరూ ఏపీని అభివృద్ధి చేయలేరన్న అపోహలోనే చంద్రబాబు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. నిజంగా జగన్ పాలన బాగా లేకుంటే వారికి చంద్రబాబు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. పవన్, బీజేపీలను పెద్దగా నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు ఇకనైనా జగన్ పై అవినీతి ఆరోపణలు మానుకుని, ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు మరో మార్గాలను చూసుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News