సింప‌తీ కోసం.. టీడీపీలో ఇదో ప్ర‌చారం.. న‌మ్మాలా..?

రాజ‌కీయాల్లో ప్రజ‌ల సింప‌తీని క్యాష్ చేసుకోవ‌డంలో టీడీపీని మించిన పార్టీ మ‌రొక‌టి లేద‌ని అంటారు. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిప‌క్షంలో ఉన్నా.. ఆ పార్టీ సింప‌తీ రాజ‌కీయాల‌నే న‌మ్ముకుంటుంద‌నే [more]

Update: 2021-08-28 09:30 GMT

రాజ‌కీయాల్లో ప్రజ‌ల సింప‌తీని క్యాష్ చేసుకోవ‌డంలో టీడీపీని మించిన పార్టీ మ‌రొక‌టి లేద‌ని అంటారు. అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిప‌క్షంలో ఉన్నా.. ఆ పార్టీ సింప‌తీ రాజ‌కీయాల‌నే న‌మ్ముకుంటుంద‌నే పేరుంది. అప్పటికి ఏ స‌మ‌స్య వ‌స్తే.. దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్రజ‌ల నుంచి సింప‌తీ గెయిన్ చేయాల‌ని పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ త‌ల‌పోస్తారనే పేరుంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న మ‌హిళా ఓటు బ్యాంకును సింప‌తీతోనే త‌న‌వైపు తిప్పుకొనే ప్రయ‌త్నం చేశారు. అప్పటి వ‌ర‌కు లేనిది..ప‌సుపు-కుంకుమ పేరుతో వారిని ఆక‌ర్షించే ప్రయ‌త్నం చేశారు.

సానుభూతి కోసం..?

దీనికి ముందు కూడా ఆయ‌న రాష్ట్రం అంతా తిరిగి తాను ఎందుకు క‌ష్టప‌డాల‌ని.. త‌న‌కు ఏం అవ‌స‌ర‌మ‌ని.. ఇదంతా తాను ప్రజ‌ల కోసమే చేస్తున్నాన‌ని చంద్రబాబు చెప్పుకొనే ప్రయ‌త్నం చేశారు. ఇక‌, త‌న ప్రభుత్వానికి గ్రాఫ్ పెరుగుతోంద‌ని ఊద‌ర గొట్టిన సంద‌ర్భాలు కూడా తెలిసిందే. త‌న ప్రభుత్వం ప‌ట్ల.. సంతృప్తి స్థాయి అధికంగా ఉంద‌ని.. ఇది నానాటికీ పెరుగుతోంద‌ని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే.. ఎన్ని సింప‌తీ య‌త్నాలు చేసినా.. చంద్రబాబుకు ఫ‌లించ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిది. అయినా బాబు మాత్రం మార‌లేదు. ఇప్పటికీ చంద్రబాబు సింప‌తీనే న‌మ్ముకున్నట్టు క‌నిపిస్తోంది. అది కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి చంద్రబాబు పెద్ద సింప‌తీ గెయిన్ ప్లాన్ చేసుకున్నార‌ట‌.

ఈ ప్రచారం మేరకు….

టీడీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చల మేర‌కు.. చంద్రబాబు.. త‌న త‌న‌యుడు నారా లోకేష్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిపించుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిపాద‌న‌ను, నిర్ణయాన్ని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. దీనికి సంబంధించి లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్న తీరే ఇప్పుడు వివాదంగా మారుతోంది. సింప‌తీ ప్లే చేస్తున్నారా ? అనే సందేహాలు తెర‌మీద‌కి వ‌చ్చేలా చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మణి కూడా వ‌చ్చి ఇక్కడ ప్రచారం చేశారు. అయిన‌ప్పటికీ.. ఫ‌లితం ద‌క్కలేదు. వైసీపీ నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్నారెడ్డిపై ఓడిపోయారు.

ఒక వర్గం మీడియా….

అయిన‌ప్పటికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేస్తాన‌ని లోకేష్ ప్రక‌టించారు. కానీ.. ఇప్పటి వ‌ర‌కు ఆశించిన స్థాయిలో మంగ‌ళ‌గిరిలో ఆళ్లకుచెక్ పెట్టే కార్యక్రమాలు ఒక్కటి కూడా లోకేష్ చేప‌ట్టలేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ పోటీ చేసినా.. ఎంత రాజ‌ధాని అనుకూల‌త ఆయ‌న‌కు ప్లస్ అవుతుంద‌ని అనుకున్నా.. ఫ‌లితం క‌నిపించ‌డం లేద‌ని పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటే.. తాను సంప్రదాయంగా దాదాపు 35 ఏళ్లుగా పోటీ చేస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని లోకేష్‌కు ఇస్తున్నట్టు ఓ వ‌ర్గం మీడియాకు లీకులు ఇచ్చార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

త్యాగానికి రెడీ అయినట్లు…?

అంటే.. చంద్రబాబు.. తాను త్యాగం చేసేందుకురెడీ అయ్యార‌ని.. ఇది కూడా కేవ‌లం రాష్ట్ర ప్రజ‌ల కోసం ఓయువ నేత‌ను అందించేందుకు యువ నేత‌ను అసెంబ్లీకి పంపేందుకు ఎంచుకున్న మార్గమ‌ని.. ప్రచారం ప్రారంభ‌మైంది. అంటే.. ఇప్పడు చంద్రబాబు కోస‌మైనా..(కుప్పంను లోకేష్‌కు ఇస్తే.. బాబుకు చోటు ఉండ‌ద‌ని.. ఆయ‌న లాంటి మేధావిని మ‌నం దూరం చేసుకుంటామా ? అని) మంగ‌ళ‌గిరి ప్రజ‌లు.. లోకేష్‌ను గెలిపించి తీరాల‌నే వాద‌నను త్వర‌లోనేత‌మ్ముళ్లు తెర‌మీదికి తెచ్చేలా టీడీపీ వ‌ర్గాల్లో ఓ ప్లాన్ న‌డుస్తోంది. మ‌రి ఈ సెంటిమెంటు, సింప‌తీ ఏమేర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News