Chandrababu : పెట్రోలు ఫ్రీగా పోస్తానన్నా నమ్మరేమో?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో అన్నీ ఎదురుతన్నేలా ఉన్నాయి. ఆయన ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను, విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో అన్నీ ఎదురుతన్నేలా ఉన్నాయి. ఆయన ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను, విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో అన్నీ ఎదురుతన్నేలా ఉన్నాయి. ఆయన ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను, విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయనకు వచ్చే ఎన్నికల్లో శాపంగా మారనున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మరోలా, లేనప్పుడు ఇంకోలా చంద్రబాబు మాట్లాడటాన్ని తప్పుపడుతున్నారు. ఆయన చేస్తే రైట్.. ఇతరులు చేస్తే రాంగ్ అన్న ధోరణిలో చంద్రబాబు రాజకీయం సాగుతుంది.
పాత విషయాలను….
ఇంతకు ముందు రోజులు కావు. పాత విషయాలను కూడా తవ్వి తీసి మరోసారి గుర్తు చేసే డేస్ ఇవి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక ప్రభుత్వ ఆస్తులను విక్రయించారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అనేక ప్రభుత్వ ఆస్తులను విక్రయించారు. తనకు తానే రాష్ట్రానికి సీఈవో గా ప్రకటించుకున్న చంద్రబాబు ప్రయివేటీకరణ వైపు మొగ్గు చూపారు. దాదాపు నలభైకి పైగా ప్రభుత్వ సంస్థలను విక్రయించారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను విక్రయిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలకు విలువ లేకుండా పోయింది.
ఎన్నికలకు ముందు….
ఇక ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసే వాగ్దానాలకు కూడా విలువ ఉండే అవకాశం లేదు. హామీల విషయంలో చంద్రబాబును జగన్ తో ఈ ఎన్నికల్లో పోల్చుకుంటారు. జగన్ తాను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పర్చారు. రెండున్నరేళ్లలోనే 90 శాతం హామీలను అమలు చేశారు. చంద్రబాబు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలన్నింటినీ మరచి పాలన చేపట్టారు. ఇప్పుడు కొత్తగా ఎన్ని వరాలు ప్రకటించినా జనాలు నమ్మే పరిస్థిితి మాత్రం ఉండదు.
హామీలు ఇచ్చినా…?
రాజకీయంగా చంద్రబాబు అనుభవం సంపాదించినా క్రెడిబులిటీ నేతగా మిగిలిపోయారు. ఒక మాట మీద ఉండరని, అవసరానికి తగినట్లు మార్చేస్తారన్న ముద్రపడిపోయారు. దీంతో చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరికీ ఉచితంగా పెట్రోలు పోస్తానన్నా జనం విశ్వసించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికలకు ఎలాంటి హామీలతో, ఏ యే అంశాలున్న మ్యానిఫేస్టోతో ప్రజల ముందుకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది.