Chandrababu : “కమ్మ నోళ్లకు తాళాలు.. వారే ఫోకస్ కావాలి

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలను మార్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే జనసేనతో కొంత గ్యాప్ తగ్గుతుంది. పవన్ కల్యాణ్ తో పోటీ [more]

Update: 2021-10-25 05:00 GMT

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలను మార్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే జనసేనతో కొంత గ్యాప్ తగ్గుతుంది. పవన్ కల్యాణ్ తో పోటీ చేయడానికి చంద్రబాబు సిద్దమయిపోయారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో ఏడాదిలో నేరుగా రెండు పార్టీలూ పొత్తు పెట్టుకునే వీలుంది. ఈ సమయంలో తన పార్టీపై కమ్మ సామాజికవర్గం ముద్రను తొలగించుకోవాలన్న భావనలో చంద్రబాబు ఉన్నారు.

ఈ కాంబినేషన్ తో….

కమ్మ, కాపు కాంబినేషన్ అని తీవ్రంగా ప్రచారం జరిగితే అది చంద్రబాబుకు నష్టం చేకూరుతుంది. మిగిలిన సామాజికవర్గాలన్నీ వైసీపీ వైపు చూసే అవకాశముంది. అందుకే తాను అందరి వాడినని, కమ్మ ముద్రను తనపై నుంచి తొలగించుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగానే కమ్మ సామాజికవర్గం నేతల నోళ్లకు తాళాలు వేశారు. చంద్రబాబు, లోకేష్ లు తప్ప వైసీపీపై విమర్శలకు మిగిలిన కమ్మ సామాజికవర్గం నేతలను దూరంగా ఉండాలని నిర్ణయించారు.

వీరు విమర్శలు చేస్తే…

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలను బీసీ, మైనారిటీ, ఎస్సీ సామాజికవర్గం నేతలే చేయాల్సి ఉంటుంది. రాజధాని అమరావతి నుంచి ప్రాజెక్టుల వరకూ అన్నీ అంశాలపైన కేవలం కొందరే విమర్శలు చేయాల్సి ఉంటుంది. దేవినేని ఉమ, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు మాత్రమే విమర్శలు చేసినందున ఇది కులపరంగా మారుతుందని చంద్రబాబు ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. పట్టాభి ఎపిసోడ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

వీరే ఫోకస్ కావాలి…..

అందువల్ల యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు, అమర్ నాధ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జవహర్, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య అశోక్ గజపతిరాజు, బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు మాత్రమే వైసీపీపై ఎక్కువగా విమర్శలు చేయాలని నిర్ణయించారు. వారే మీడియాలో ఎక్కువగా కన్పించాలి. వచ్చే మూడేళ్లలో వీరే క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు డిసైడ్ చేశారు. కమ్మ సామాజికవర్గం నేతలు ఎక్కువగా రియాక్ట్ కావద్దని ఆయన ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పినట్లు తెలిసింది.

Tags:    

Similar News