Tdp : కోట్లను ఇలా సైడ్ లైన్ చేసేశారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గత ఎన్నికల ఫలితాలతో అన్ని విషయాలు తెలిసి వచ్చాయి. పనికి రాని నేతలను పార్టీలోకి చేర్చుకుని తీవ్రంగా నష్టపోయాయని ఆయన తెలుసుకున్నారు. [more]

Update: 2021-10-27 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గత ఎన్నికల ఫలితాలతో అన్ని విషయాలు తెలిసి వచ్చాయి. పనికి రాని నేతలను పార్టీలోకి చేర్చుకుని తీవ్రంగా నష్టపోయాయని ఆయన తెలుసుకున్నారు. అధికారంలో ఉండగా పోలోమంటూ వచ్చిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. వారికి చరిత్ర తప్ప ప్రజాదరణ లేదన్నది చంద్రబాబు గుర్తించారు. వారిలో చాలా మందిని పక్కన పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. వారి విష‍యంలో చంద్రబాబు ఇప్పటికే క్లారిటీకి వచ్చారు.

సీనియర్ నేతలను….

గత ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలను చంద్రబాబు పార్టీలోకి తీసుకు వచ్చారు. వారిలో కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వంటి నేతలున్నారు. వీరంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. వీరిలో ఎవరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించారు. వారిని కొనసాగిస్తే ఆ ప్రాంతాల్లో పార్టీకి కూడా రాజకీయ భవిష్యత్ ఉండదని చంద్రబాబు గుర్తించారు.

కోట్ల ఫ్యామిలీకి….

ఇందులో ప్రముఖంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశాలు లేవు. ఆయనది రాజకీయంగా గతించిన చరిత్ర. కొత్తనేతలు పుట్టుకొచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్లు మారిపోయాయి. అగ్రకులాల పెత్తనం అనేది కన్పించకుండా పోయింది. ఈ నేపథ్యంలో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నా గత కొన్ని దఫాలుగా రెడ్డి సామాజికవర్గం నేతలే గెలుస్తూ వస్తున్నారు.

అన్నీ మారిపోవడంతో….

గత రెండు ఎన్నికల నుంచి పరిస్థితి మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో బీసీ నేతలే పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. దీంతో చంద్రబాబు కూడా కర్నూలు పార్లమెంటుకు ఈసారి బీసీ నేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కోట్ల కుటుంబంలో ఆయన భార్య సుజాతమ్మకు మాత్రం అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తారు. ఆలూరు లేదా డోన్ లో ఒకటి కోట్ల ఫ్యామిలీకి కేటాయిస్తారు. దీనిపై కోట్ల ఫ్యామిలీకి చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద కోట్ల ను చంద్రబాబు సైడ్ లైన్ చేసినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News