Chandrababu : ఆఫ్టర్ ఫార్టీ మంత్స్…. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ….?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇన్నాళ్లకు అవకాశం దక్కింది. దాదాపు నలభై నెలల తర్వాత నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. శనివారం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇన్నాళ్లకు అవకాశం దక్కింది. దాదాపు నలభై నెలల తర్వాత నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. శనివారం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇన్నాళ్లకు అవకాశం దక్కింది. దాదాపు నలభై నెలల తర్వాత నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. శనివారం ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రిని అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై చంద్రబాబు అమిత్ షాకు వివరించనున్నారు. అమిత్ షాతో పాటు వీలయితే రాష్ట్రపతిని కూడా కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలకు ముందు….
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అదీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. దీంతో పాటు టెన్ జన్ పథ్ ను కూడా చంద్రబాబు సందర్శించారు. రాహుల్ గాంధీని కలిసి మోదీకి వ్యతిరేకంా పోరాడాలని పిలుపు నిచ్చారు కూడా. ఢిల్లీలో దీక్షలకు దిగి మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు తన తప్పును ఒప్పుకున్నారు. మోదీతో కలసి పనిచేస్తానని చెప్పుకున్నారు.
అమిత్ షాను కలిసే…
అయితే చంద్రబాబు గత మూడేళ్ల నుంచి ఢిల్లీ గడప తొక్కలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జట్టుకట్టిన చంద్రబాబు ఆ తర్వాత దాని ఊసే మరిచారు. బీజేపీతో తిరిగి ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన కొద్దిరోజులుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ స్థానిక బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్లాన్ అమలు కాలేదు. అయితే ఇప్పుడు పార్టీలో అగ్రనేత అమిత్ షాను కలిసే అవకాశం దక్కింది.
ఢిల్లీకి దారి దొరకడంతో….
ఇటీవల కాలంలో చంద్రబాబుకు మోదీకి లేఖలు రాయడం కూడా ఎక్కువయింది. బీసీ జనగణన, బోయకులాన్ని ఎస్టీలో చేర్చాలంటూ మోదీకి లేఖలు రాస్తున్నారు. తన ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే దాడికి వచ్చినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడిని జాతీయ మీడియాలో హైలెట్ అయ్యేలా చూడగలిగారు. ఢిల్లీకి దారి వెతుక్కునేందుకు ఈ ఘటన ఉపయోగపడింది. చంద్రబాబు అమిత్ షా ను కలసి ఇటు జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంతో పాటు సమ్మతిస్తే తాను కలసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి కూడా చంద్రబాబుకు అవకాశం దక్కింది.