Chandrababu : కోపంతో రగలిపోతున్న పెద్దాయన.. ఎందుకంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒంటరి పోరు చేయక తప్పడం లేదు. పార్టీ నేతలు పెద్దగా కలసి రారని తెలిసే ఒంటరిగా ఆయన దీక్షకు దిగారని తెలిసింది. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒంటరి పోరు చేయక తప్పడం లేదు. పార్టీ నేతలు పెద్దగా కలసి రారని తెలిసే ఒంటరిగా ఆయన దీక్షకు దిగారని తెలిసింది. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒంటరి పోరు చేయక తప్పడం లేదు. పార్టీ నేతలు పెద్దగా కలసి రారని తెలిసే ఒంటరిగా ఆయన దీక్షకు దిగారని తెలిసింది. పార్టీ కార్యాలయాలపై పెద్దయెత్తున వైసీపీ శ్రేణులు దాడులకు దిగినా నేతల్లో పెద్దగా చైతన్యం రాకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బంద్ విషయంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తారని తెలిసి అందుకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తేజాన్ని నింపాలని….
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడంతో టీడీపీ శ్రేణుల్లోనూ మార్పు వస్తుందని చంద్రబాబు భావించారు. అందుకే వారిలో ఉత్తేజాన్ని నింపడం కోసం బంద్ కు పిలుపు నిచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో బంద్ జరగలేదు. ఒకరకంగా బంద్ విఫలమయిందనే చెప్పాలి. నిన్న సాయంత్రానికి జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఒంటరిగానే….
అందుకే తాను ఒంటరిగా 36 గంటలు దీక్షలు చేయాలని నిర్ణయించారు. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినా పెద్దగా స్పందన రాలేదు. పార్టీ నేతలు కేవలం ఫొటోలు తీయించుకుని కేంద్ర కార్యాలయానికి పంపి గంటలోనే కార్యక్రమాన్ని ముగించారు. అందుకే చంద్రబాబు ఈసారి ఆ తప్పిదం చేయదలచుకోలేదు. తాను ఒంటరిగానే దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు.
సీనియర్ల పై సీరియస్….
మరోవైపు పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగినా స్పందించని నేతలపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మీరు బయటకు వస్తారని కోస్తాంధ్రలోని కొందరి నేతలను చంద్రబాబు సూటిగానే ప్రశ్నించినట్లు సమాచారం. నేతలే ముదుకు రాకపోతే ఇక కార్యకర్తలు బయటకు ఎలా వస్తారని ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేతకు చంద్రబాబు బాగానే క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. మొత్తం మీద బంద్ విషయంలోనూ నేతలు చంద్రబాబు ఆశించినట్లు వ్యవహరించకపోవడం పట్ల ఆయన కోపంతో రగలిపోతున్నట్లు తెలిసింది.