Chandrababu : బాబు ఢిల్లీ యాత్ర….కలవడానికే ఇష్టపడటం లేదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవసరార్ధ రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వరకూ పాకింది. ఆయనకు ఇప్పుడు ఢిల్లీలో ఎవరూ నమ్మకమైన మిత్రులు లేరు. గతంలో చంద్రబాబు [more]

Update: 2021-10-22 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవసరార్ధ రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వరకూ పాకింది. ఆయనకు ఇప్పుడు ఢిల్లీలో ఎవరూ నమ్మకమైన మిత్రులు లేరు. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళితే అనేక మంది సన్నిహితులను కలసుకునే వారు. ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్, శరద్ పవార్ వంటి నేతలను కలసుకుని జాతీయ రాజకీయాలపై చర్చించేవారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఆయనకు ఇప్పుడు ఢిల్లీలో సన్నిహితులు ఎవరూ లేరనే చెప్పాలి.

పిలవడానికి కూడా…

ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న కూటమికి కూడా చంద్రబాబుకు పిలుపు లేదు. మమతబెనర్జీ అందరికీ లేఖలు రాశారు కానీ, చంద్రబాబును మాత్రం దూరం పెట్టారు. ఇక చంద్రబాబు విషయాన్ని కాంగ్రెస్ కూడా పసిగట్టి ఆ దరిదాపులకు రానివ్వడం లేదు. చంద్రబాబు స్వయంగా వస్తే తప్ప ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపులు లేవు. ఇక బీజేపీ సంగతి తెలిసిందే. మూడేళ్ల ముందే చంద్రబాబు ను దూరం పెట్టింది.

బీజేపీ కూడా….

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ యాత్ర కొనసాగనుంది. బీజేపీ కూడా అంత ఆషామాషీగా ఈసారి చంద్రబాబుకు లొంగిపోయే అవకాశాలు లేవు. ఇప్పటికే చంద్రబాబు మూడు సార్లు బీజేపీని ముంచేశారు. అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాత బీజేపీని విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు. ఒక ప్రతిపక్ష నేతగా ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించవచ్చేమో కాని, చంద్రబాబును కలుపుకుని వెళ్లేంత సీన్ లేదన్నది పార్టీ వర్గాల టాక్.

టీడీపీ నేతల యత్నాలు…

ఇది ఎవరో చేసింది కాదు. చంద్రబాబు స్వయంగా చేసుకుందే. కూటములను మార్చి విశ్వసనీయతను ఢిల్లీ స్థాయిలోనూ చంద్రబాబు కోల్పోయారు. దీంతో చాలా రోజుల తర్వాత ఢిల్లీ వెళుతున్నప్పటికీ ఆయనకు అక్కడ పెద్దగా వర్క్ అవుట్ అయ్యేది లేదన్నది సమాచారం. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు పార్టీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేదంటున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. మొత్తం బాబు ఢిల్లీ యాత్ర ఆయన అనుకూల మీడియాకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News