Tdp : “బోస్ డీకే” నే చివరకు బోల్తా కొట్టించిందా?
తెలుగుదేశం పార్టీ లో ఎప్పటి నుంచో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. వారంతా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా? లేదా? అన్న [more]
తెలుగుదేశం పార్టీ లో ఎప్పటి నుంచో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. వారంతా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా? లేదా? అన్న [more]
తెలుగుదేశం పార్టీ లో ఎప్పటి నుంచో ఉన్న నేతలు ఇప్పుడు పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. వారంతా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది నేతలు మినహా ఎవరూ పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే పరిస్థితి. దీంతో సీనియర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాటజీలను మార్చాలని చంద్రబాబును కోరుతున్నారు. వైసీపీ వ్యూహాల ముందు తేరుకోలేకపోతున్నామని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సానుభూతి కోసం….
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సానుభూతి కోసం చేసే యత్నాలు ఫలించడం లేదు. పట్టాభి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దాడులు చేసినా పెద్దగా ప్రజల నుంచి సింపతీని పొందలేకపోయారు. వైసీపీ పట్టాభి చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. బోస్ డీకే అనే పదానికి అర్థాన్ని ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎమ్మెల్యేల వరకూ ప్రజలకు వివరించారు. దీంతో పట్టాభి తప్పును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
పోటా పోటీగా….
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులు జరిగాయి. ఈ దాడులను జాతీయ మీడియా కూడా హైలెట్ చేసింది. దీంతో చంద్రబాబు దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలనుకున్నారు. వెంటనే బంద్ కు పిలుపు నిచ్చారు. దానికి విరుగుడుగా వైసీపీ నిరసన ప్రదర్శనలకు దిగింది. బంద్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వెంటనే చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగారు. దీనికి ప్రతిగా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షలకు దిగింది.
ఆ పదమే ప్రజల్లోకి….
చంద్రబాబు వేసే ప్రతి అడుగును, వ్యూహాన్ని వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటుంది. అదే సీనియర్ నేతలు ఇప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ఆఫీస్ లపై జరిగిన దాడులు, పట్టాభి అరెస్ట్ ల కన్నా బోస్ డీకే అనే పదమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. ిఇందులో వైసీపీ సక్సెస్ అయిందని, ఇలాంటి వ్యూహాలు మాని ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని సీనియర్ నేతలు కొందరు చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది.