Chandrababu : ఉపవాసం ఊపిరి పోసినట్లుందిగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత తెచ్చిందో తెలియదు కాని పార్టీని ఒక గాడిన పెట్టిందనే చెప్పాలి. చంద్రబాబు చేపట్టిన 36 [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత తెచ్చిందో తెలియదు కాని పార్టీని ఒక గాడిన పెట్టిందనే చెప్పాలి. చంద్రబాబు చేపట్టిన 36 [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత తెచ్చిందో తెలియదు కాని పార్టీని ఒక గాడిన పెట్టిందనే చెప్పాలి. చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష పట్ల ప్రజల నుంచి సానుభూతి టీడీపీపై ఎంతవరకూ వస్తుందన్నది పక్కన పెడితే పార్టీని ఐక్యంగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను కేంద్ర కార్యాలయానికి రప్పించగలిగారు.
అసంతృప్తి నేతలు….
అంతేకాదు పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలు, అసహనంతో ఉన్న నేతలు సయితం చంద్రబాబు దీక్షకు దిగిరాకతప్పలేదు. ముఖ్యంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చంద్రబాబు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. కేశినేని నాని గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చివరకు చంద్రబాబు దీక్ష వద్దకు వచ్చి తాను పార్టీలోనే ఉన్నానని చెప్పేలా చంద్రబాబు చేశారు.
యాక్టివ్ గా లేని లీడర్లు…
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉన్న ముఖ్యనేతలందరూ వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా గత కొంతకాలంగా యాక్టివ్ గా లేరు. ఆయన పీలేరు నియోజకవర్గంలో కూడా పెద్దగా పర్యటించడం లేదు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అలాంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబు దీక్ష స్థలికి పీలేరు నుంచి తన వర్గం నేతలను తీసుకు వచ్చి మద్దతు పలికారు.
క్యాడర్ లో జోష్……
చంద్రబాబు దీక్ష కేవలం నేతలను యాక్టివ్ చేయడమే కాదు క్యాడర్ లో కూడా ఉత్సాహం నింపింది. కార్యకర్తల్లో పట్టుదల పెంచారు. క్యాడర్ చంద్రబాబు దీక్ష వద్దకు పరుగులు తీయడంతో ఇక నేతలు కూడా బయటకు రాని పరిస్థితిని తన దీక్ష ద్వారా ఆయన కల్పించారు. వైసీపీ నేతల అరాచకానికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేపట్టినా చివరకు ఆయన పార్టీని బలోపేతం చేయడానికి దీనిని బాగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబు ఉపవాసం పార్టీకి ఊపిరి పోసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.