Tdp : నిమ్మరసం ఇచ్చినా నీరసం మిగిలిందే?

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకూ కీలక భూమిక పోషించింది. అయితే వరస వ్యూహాత్మక తప్పిదాలతో అది చేటును కోరి తెచ్చుకున్నట్లవుతుంది. నలభై ఏళ్ల [more]

Update: 2021-10-23 05:00 GMT

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకూ కీలక భూమిక పోషించింది. అయితే వరస వ్యూహాత్మక తప్పిదాలతో అది చేటును కోరి తెచ్చుకున్నట్లవుతుంది. నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు ఆవేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి మరింత అపఖ్యాతిని తెస్తున్నాయి. ఇప్పుడు దీక్షలతో సానుభూతి తెచ్చుకుందామనుకున్న చంద్రబాబుకు రిజల్ట్ జీరోగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ప్రజలకు సంబంధం లేని…

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఏమాత్రం సంబంధం లేనివి. ఇవి వైపీపీ, టీడీపీీ ల మధ్య వార్ గానే ప్రజలు చూస్తున్నారు. అదే సమయంలో రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణగానే జనం భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రజలకు నేరుగా సంబంధం లేకపోవడంతో టీడీపీకి పెద్దగా మైలేజీ రాలేదు. దూకుడు ప్రదర్శించాల్సిన టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. అదే సమయంలో ఆత్మరక్షణలో పడాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది.

రాంగ్ ట్రాక్…

పట్టాభి విషయంలో చంద్రబాబు పెద్ద తప్పిదం చేశారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ప్రజల మద్దతు లభించదు. ఆ విషయం తెలిసినా చంద్రబాబు వ్యూహాత్మకంగా దీక్షను ఎంచుకున్నారు. పట్టాభి తిట్లకు, ప్రజాసమస్యలకు సంబంధం లేదు. అయినా చంద్రబాబు ఇదేదో రాష‌్ట్ర సమస్య లాగా తన నెత్తికెత్తుకుని 36 గంటలు సెంట్రల్ ఆఫీస్ లో సీన్ క్రియేట్ చేశారు.

ఢిల్లీ పర్యటన కూడా…..

గత రెండున్నరేళ్లుగా టీడీపీ పరిస్థితి బాగాలేదు. పార్టీ నేతలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తొలుత పార్టీని చక్కదిద్దుకోవాలి. నియోజకవర్గాలన్నింటికీ ఇన్ ఛార్జులను నియమించాలి. ఆ తర్వాతే ప్రభుత్వంపై పోరాడాలి. అలా కాకుండా చంద్రబాబు ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా పట్టాభి విషయంలో రాంగ్ ట్రాక్ పట్టి పార్టీని కూడా నవ్వులపాలు చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం కూడా వ్యూహాత్మక తప్పిదమే. హస్తిన లో కూడా నవ్వుల పాలయితే ఇక పార్టీ మరింత క్షీణించక మానదు. అందుకే నిమ్మరసం ఇచ్చినా పార్టీకీ ఉత్తేజం కలిగించకపోగా మరింత నీరసం మిగిల్చారు చంద్రబాబు.

Tags:    

Similar News