Tdp : చేసిందంతా ఆయనే.. ఇప్పుడు అనుభవిస్తుందీ ఆయనే
చంద్రబాబు ఎప్పుడూ తాను తీసుకున్న నిర్ణయాలే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ పవర్ పోయిన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. నమ్మకమైన నేతలను [more]
చంద్రబాబు ఎప్పుడూ తాను తీసుకున్న నిర్ణయాలే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ పవర్ పోయిన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. నమ్మకమైన నేతలను [more]
చంద్రబాబు ఎప్పుడూ తాను తీసుకున్న నిర్ణయాలే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ పవర్ పోయిన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. నమ్మకమైన నేతలను వదులుకుని ఆర్థిక పరిస్థితిని బట్టి చంద్రబాబు అభ్యర్థులను నిర్ణయించేవారు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. తాను నాడు నిర్ణయించిన వారే ఇప్పుడు ఎదురు తిరిగి సమస్యగా మారారు. ఇదంతా చంద్రబాబు చేసుకున్న స్వయంకృతమే.
రెండు చోట్ల….
గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. అక్కడ ఆ పరిస్థితులు తలెత్తడానికి చంద్రబాబు మాత్రమే కారణమని చెప్పకతప్పదు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీతో పాటు తనను, తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు పార్టీని ఏళ్లుగా నమ్ముకున్న నాయకులను కాదని వీరికి టిక్కెట్లు ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
నమ్మకమైన కుటుంబాన్ని….
గుడివాడలో రావి ఫ్యామిలీ పార్టీకి నమ్మకంగా ఉండేది. రావిశోభనాద్రితో పాటు ఆయన తనయులు కూడా పార్టీకి నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలుగా రావి ఫ్యామిలీ గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఐదు సార్లు విజయం సాధించింది. అయినా చంద్రబాబు రావి శోభనాద్రి మరణం తర్వాత 2004లో కొడాలి నానికి టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సు మేరకు కొడాలికి టిక్కెట్ ఇచ్చారని చెబుతున్నా, రావి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగాలేకనే కొడాలికి ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబుకు ఏకు మేకులా తయారయ్యారు. కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని ప్రత్యర్థి పార్టీకి చంద్రబాబు అప్పగించినట్లయింది.
దాసరి ఫ్యామిలీని…..
గన్నవరం నియోజకవర్గంలో కూడా పరిస్థిితి అందుకు భిన్నంగా లేదు. దాసరి బాలవర్థనరావు కుటుంబం గన్నవరంలో టీడీపీకి అండగా ఉండేది. వారు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కావడం, నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో అప్పట్లో చంద్రబాబు దాసరి ఫ్యామిలీని కాదని వల్లభనేని వంశీకి నియోజకవర్గానికి అప్పగించారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి, నమ్మకమైన నేతలను తప్పించి చంద్రబాబే కారణమయ్యారన్నది వాస్తవం. ఆ నిర్ణయం ఫలితాన్ని చంద్రబాబు ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది.