Chandrababu : సందు దొరికినట్లే… దూరిపోయినట్లేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నించారు. కానీ [more]

Update: 2021-10-27 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో ఆయన నిరాశతో వెనుదిరిగి వచ్చారు. కానీ చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన తర్వాత అమిత్ షా ఆయనకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఇది నిజమే అయితే చంద్రబాబుకు కొంత ఊరట లభించినట్లే చెప్పుకోవాలి.

గతంలో ప్రధాని కూడా….

చంద్రబాబుకు బీజేపీ నేతలు ఫోన్ చేయడం కొత్తేమీ కాదు. కరోనా సమయంలో ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన సూచనలు తీసుకున్నారు. చంద్రబాబు కూడా కరోనా కట్టడికి వైద్య నిపుణులు సూచించిన చర్యలను లేఖ ద్వారా ప్రధాని కార్యాలయానికి పంపారు. అయితే అమిత్ షా ఫోన్ తర్వాత చంద్రబాబులో కొంత ఉత్సాహం కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

సున్నితంగా తిరస్కరించి….

అమిత్ షా తనను కలిసేందుకు ఢిల్లీ రమ్మన్నప్పటికీ సున్నితంగా తిరస్కరించి, రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, గత రెండున్నరేళ్లుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై వేసిన పుస్తకాన్ని కూడా పంపుతామని చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడుల దృశ్యాలను కూడా పంపుతామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ను అమలు పర్చాలని అమిత్ షాను ఫోన్ లో చంద్రబాబు కోరారు.

దీపావళి తర్వాత….

కానీ అమిత్ షాతో వ్యక్తిగతంగా కలిసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. దీపావళి పండగ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఢిల్లీ వెళ్లి ఎవరినీ కలవకుండా రావడంతో చంద్రబాబుపై సెటైర్లు కన్పించాయి. దీంతో పాటు స్వయంగా కలసి వెళ్లి మాట్లాడితే రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ తగ్గుతుందన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే దీపావళి తర్వాత చంద్రబాబు మళ్లీ ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News