Chandrababu : బాబుకు ఈసారి అంత ఆషామాషీ కాదట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు వచ్చే ఎన్నికలు అంత ఆషామాషీ కాదు. బలమైన జగన్ ను ఎదుర్కొనడం అంత సులువు కాదు. ఇప్పుడు చంద్రబాబు, జగన్ [more]

Update: 2021-11-06 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు వచ్చే ఎన్నికలు అంత ఆషామాషీ కాదు. బలమైన జగన్ ను ఎదుర్కొనడం అంత సులువు కాదు. ఇప్పుడు చంద్రబాబు, జగన్ పాలనను జనం చూశారు. బేరీజు వేసుకుంటే ఇద్దరికీ పెద్దగా తేడా ఏమీ లేదు. అభివృద్ధి అంటూ ఒకరు పరుగులు తీస్తే, సంక్షేమం అంటూ మరొకరు పాలన చేస్తారు. అయితే జగన్ కు సంక్షేమ పథకాలు అడ్వాంటేజీ. చంద్రబాబు వస్తే వాటిని తీసివేస్తారన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉంది.

పథకాలన్నింటినీ….

చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతు సాయం, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలను ఖచ్చితంగా తొలగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పేర్లు మార్చి ఈ పథకాలను కొనసాగించినా నగదు పంపిీణీ విషయంలోనూ, లబ్దిదారులకు కోత పెట్టడంలోనూ చంద్రబాబు ముందుంటారు. దీంతో చంద్రబాబు వస్తే పథకాలన్నీ తీసేస్తారన్న ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రజల్లోకి వైసీీపీ బలంగా తీసుకెళుతుంది.

కొన్ని ప్రాంతాలకే….

దీంతోపాటు చంద్రబాబు మళ్లీ రాజధాని అమరావతి అంటూ అక్కడే లక్షల కోట్లు ఖర్చు చేస్తారని, మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారాన్ని కూడా వైసీపీ ప్రారంభించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అలాగే చంద్రబాబు కొన్ని వర్గాలకే అండగా ఉంటారని కూడా గ్రామాల్లో వైసీపీ ప్రచారాన్ని చేస్తుంది. చంద్రబాబు కేవలం స్వార్థ ప్రయోజనాలే చూసుకుంటారని రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడతారన్న టాక్ కూడా గ్రామాల్లో నడుస్తుంది.

లోకేష్ ఎంటర్ అయితే?

అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఎక్కువ కాలం ఉండరని, ఆయన లోకేష్ కు పదవి ఇచ్చి తాను తప్పుకుంటారన్న ప్రచారమూ ఉంది. 2014లో లోకేష్ గెలవకపోయినా ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రివర్గంలోకి తీసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో నెలకొన్న సందేహాలన్నింటినీ చంద్రబాబు తీర్చాల్సి ఉంటుంది. వారికి స్కీమ్ ల మీద భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. తన నాయకత్వమే కొనసాగుతుందన్న భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే చంద్రబాబుకు కష్టాలు తప్పవు.

Tags:    

Similar News