Tdp : ఇంతకీ ఆ “రెడ్డి” గారు ఎవరో?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ఆశ మాత్రం నెరవేరలేదు. ఎప్పటికైనా అది సాధించాలన్న పట్టుదల, కసితో ఉన్నారు. చంద్రగిరి [more]

Update: 2021-11-06 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ఆశ మాత్రం నెరవేరలేదు. ఎప్పటికైనా అది సాధించాలన్న పట్టుదల, కసితో ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేయాలన్న కోరికను ఈసారి నెరవేర్చుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబు స్ట్రాటజీ మార్చబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

చివరి సారిగా గెలిచి….

చంద్రగిరిలో చివరి సారిగా 1994లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇక్కడ నుంచి గెలుపొందారు. తర్వాత ఇక గెలుపు దక్కలేదు. అంటే చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్న తర్వాత సొంత ఇలాకాలో టీడీపీని గెలిపించుకోలేకపోయారు. నిజంగా చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చగానే చెప్పుకోవాలి. ఎన్ని ప్రయోగాలు చేసినా చంద్రగిరిలో చంద్రబాబు ప్రయోగాలు ఫలించలేదు.

ఎన్ని ప్రయోగాలు చేసినా…?

గల్లా అరుణకుమారిని కాంగ్రెస్ నుంచి తీసుకు వచ్చి పోటీ చేయించినా ఫలితం దక్కలేదు. గల్లా అరుణకుమారి అక్కడ కాంగ్రెస్ నుంచి వరసగా మూడుసార్లు గెలిచారు. టీడీపీలో వచ్చిన తర్వాత ఓటమి పాలయ్యారు. అంటే గల్లా కు కాంగ్రెస్ లో కలసి వచ్చింది కానీ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఓటమి పాలు కావడంతో జీర్ణించుకోలేక ఆమె సైడయిపోయారు. దీంతో గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన పులివర్తిని నానిని చంద్రగిరి బరిలోకి దింపినా ఫలితం కన్పించలేదు.

సహజంగానే అసంతృప్తి….

ఇప్పటికే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. సహజంగానే పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటే అసంతృప్తి ప్రజల్లోకి వస్తుంది. అందుకే ఈసారి చెవిరెడ్డిని ఓడించాలంటే రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థినే పోటీకి దింపాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. అయితే ఆ రెడ్డి నేత ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. మరోసారి చంద్రబాబు “కుల” ప్రయోగం సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News