Chandrababu : కొత్త ఎత్తులతో బాబు …అనుకున్నది సాధిస్తారా?

తెలుగుదేశం పార్టీ కొత్తగా జనంలోకి వెళ్లబోతుంది. అనుభవం లేమి కారణంగానే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయిందన్న ప్రచారాన్ని ఇక జోరుగా చేయనుంది. ఇందుకు పొరుగు రాష్ట్రాలను కూడా ఉదహరిస్తుంది. [more]

Update: 2021-11-07 00:30 GMT

తెలుగుదేశం పార్టీ కొత్తగా జనంలోకి వెళ్లబోతుంది. అనుభవం లేమి కారణంగానే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయిందన్న ప్రచారాన్ని ఇక జోరుగా చేయనుంది. ఇందుకు పొరుగు రాష్ట్రాలను కూడా ఉదహరిస్తుంది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. లేకుంటే ఆయన రాజకీయంగా చాలా నష్టపోతారు. మరోవైపు జగన్ ను చూస్తే యువకుడిగా ఉన్నారు. అన్ని రకాలుగా బలంగా కన్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు టీం ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అనుభవ లేమితోనే….?

జగన్ యువకుడు కావడం, అనుభవ లేమితోనే రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బంది పాలవుతుందని ప్రచారం జోరుగా చేయనుంది. గతంలో ఐదేళ్ల పాలనను, ఇప్పటి జగన్ పాలనను బేరీజు వేసుకోవాలని సూచిస్తుంది. అభివృద్ది, సంక్షేమాన్ని సమానంగా పరుగులు తీయించిన చంద్రబాబుకు, జగన్ కు పోలికే లేదని సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. గడచిని రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడాన్ని చంద్రబాబు పార్టీ ప్రశ్నిస్తుంది.

గతంలో….

చంద్రబాబు అధికారంలో ఉండగా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతాలకు కియా వంటి పరిశ్రమలను తెచ్చిన విషయాలను గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన అనుభవంతోనే ఇవన్నీ సాధించారని చెబుతుంది. తనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో పాటు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వేసిన అడుగులను టీడీపీ గుర్తుకు తెస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలను మూతపడుతున్నాయంటోంది.

పొరుగు రాష్ట్రాల సీఎంలతో….

మరోవైపు పొరుగున ఉన్న తమిళనాడులో స్టాలిన్, ఒడిసాలో నవీన్ పట్నాయక్, తెలంగాణలో కేసీఆర్, కేరళలో పినరయి విజయన్ వంటి వారు వయసు 70కి సమీపిస్తున్నా వారి విజన్ కారణంగానే ఆ రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయంటోంది. అందుకే ఈసారి జగన్ ను పక్కన పెట్టి అనుభవం ఉన్న చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి, యువతకు భవిష్యత్ ఉంటుందని చెబుతోంది. మొత్తం మీద చంద్రబాబు ఈసారి తన అనుభవాన్ని ప్రజల ముందు ఉంచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించారు.

Tags:    

Similar News