Chandrababu : వెనకే వస్తారటగా… దారి చూపిస్తున్నారు

ఇప్పటి వరకూ జనసే అధినేత పవన్ కల్యాణ‌్ తెలుగుదేశం పార్టీ ఏం డిమాండ్ చేస్తే అదే తన నోట నుంచి వస్తాయన్న విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు సీన్ [more]

Update: 2021-11-01 08:00 GMT

ఇప్పటి వరకూ జనసే అధినేత పవన్ కల్యాణ‌్ తెలుగుదేశం పార్టీ ఏం డిమాండ్ చేస్తే అదే తన నోట నుంచి వస్తాయన్న విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పవన్ కల్యాణ్ ముందు చంద్రబాబుకు దారి చూపించుకుంటూ వెళుతున్నారు. చంద్రబాబు కూడా పవన్ బాటలో పయనిస్తున్నారన్న సీన్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. బీజేపీ వైపు ఉన్నట్లు ఉంటూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ఇద్దరి లక్ష్యంగా ఉంది.

బద్వేలు ఉప ఎన్నిక విష‍యంలో….

మొన్న బద్వేలు ఉప ఎన్నికలో తాను పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ ముందుగా ప్రకటించారు. అప్పటికే అభ్యర్థిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెంటనే తన ఆలోచనను విత్ డ్రా చేసుకున్నారు. తాను కూడా సెంటిమెంట్ కారణంగానే బద్వేలు బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రెండు పార్టీలు పోటీ చేయకుండానే ఎన్నికలు ముగిశాయి. బీజేపీకి ఈ ఎన్నికల్లో మద్దతిచ్చాయి.

స్టీల్ ప్లాంట్ పై….

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలోనూ ముందుగా పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు డెడ్ లైన్ విధించారు. అఖిలపక్ష సమావేశాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యవహారాన్ని తెలివిగా వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టారు. ఇక ఇప్పుడు చంద్రబాబు పని మిగిలి ఉంది. టీడీపీ తొలి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకణను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతిస్తుంది. ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు కూడా దీక్ష చేశారు.

బాబు కూడా….

ఇక చంద్రబాబు కూడా దీపావళి పండగ తర్వాత విశాఖ పర్యటన చేస్తారంటున్నారు. ఆయన వచ్చి కార్మికులకు సంఘీభావం తెలిపి, రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతారు. అనంతరం అఖిలపక్ష సమావేశాన్ని చంద్రబాబు కూడా డిమాండ్ చేస్తారు. తద్వారా ప్రయివేటీకరణకు కారణమైన బీజేపీని వదిలేసి వైసీపీ పై పడతారు. ఇదంతా రానున్న కాలంలో పొత్తుతో వెళడానికి ఆడుతన్న స్ట్రాటజీ గేమ్స్ లా చూడాల్సిందే. కాకుంటే అసలు దోషిని వదిలేసి తమ ప్రత్యర్థులపై పడటాన్ని ప్రజలు ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News