Chandrababu : ఈయన తప్ప ఇక ఎవరి వల్లా కాదట

చంద్రబాబు హయాంలో అంతా పచ్చగా ఉందట. అసలు అవినీతికి ఆస్కారం లేనే లేదట. అభివృద్ధి ఏపీలో పరుగులు తీసిందట. ఇప్పుడు మాత్రం జగన్ వచ్చిన తర్వాత మొత్తాన్ని [more]

Update: 2021-11-10 13:30 GMT

చంద్రబాబు హయాంలో అంతా పచ్చగా ఉందట. అసలు అవినీతికి ఆస్కారం లేనే లేదట. అభివృద్ధి ఏపీలో పరుగులు తీసిందట. ఇప్పుడు మాత్రం జగన్ వచ్చిన తర్వాత మొత్తాన్ని పడుకోబెట్టాడట. ఏ వర్గమూ సంతృప్తికరంగా లేదంటూ ప్రతి రోజూ టీడీపీ అనుకూల మీడియా అనేక కథనాలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ వస్తోంది. తమకు తామే సమస్యలను ఊహించుకుని మరీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది.

వయసుపై….

చంద్రబాబుకు వయసు అయిపోయిందని, లోకేష్ సీఎం అవుతారని ఎవరూ అనలేదు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన రాష్ట్రంలో పర్యటనలు కూడా చేస్తున్నారు. కానీ ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారేమోనని ముందుగానే అనుకూల మీడియా భయపడినట్లుంది. అందుకే వయసుతో సంబంధం లేదని, చంద్రబాబు మెదడు ఇప్పటికీ పాదరసం కంటే చురుగ్గా పనిచేస్తుందని అనేక కథనాలను వండి వార్చారు.

ఎయిడెడ్ విద్యాసంస్థలు….

రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితీ అంతే. నిజానికి ఎయిడెడ్ స్కూళ్లు ఒకప్పుడు సేవా భావంతో నడిచేవి. కాని ఇప్పుడు మేనేజ్ మెంట్ లు స్వార్థంతో నడిపిస్తున్నాయి. ఎక్కడో చేతి వేళ్ల మీద లెక్క పెట్టినవి తప్పించి మిగిలన ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థులు లేరు. ఉపాధ్యాయులు లేరు. అసలు ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ల నియామకాన్ని ఎప్పుడో నిలిపేశారు. ప్రభుత్వం కూడా మూసివేయమని చెప్పలేదు. ఎవరికైనా భారంగా ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పింది.

రానున్న కాలంలో….

ఎయిడెడ్ స్కూళ్లకు ప్రభుత్వం మరో ఆప్షన్ కూడా ఇచ్చింది. నష్టాలు వస్తూ ఉంటే ఏదైనా ప్రయివేటు విద్యాసంస్థకు కూడా విక్రయించుకోవచ్చని, లేదంటే తామే కొనసాగించవచ్చని తెలిపింది. కానీ ఒక వర్గం మీడియా మాత్రం ఎయిడెడ్ విద్యాసంస్థలను మతంపై దాడిగా చిత్రీకరిస్తున్నాయి. విద్యార్థుల భవిష‌్యత్ ను ప్రభుత్వం పణంగా పెడుతుందని ఆరోపిస్తూ కథనాలు రాస్తున్నాయి. రాష్ట్రానికి చంద్రబాబు ఉంటేనే తప్ప ఇక ఎవరు ఉన్నా అభివృద్ధి సాధ్యం కాదన్న రీతిలో టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తున్న కథనాలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముంది.

Tags:    

Similar News