Chandrababu : వారితో చెప్పిస్తేనే పని అయ్యేటట్లుందిగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరకంగా ఇది తనకు చివరి ఎన్నికలు అని ఆయన భావిస్తున్నారు. ఈసారి ప్రజలు తన [more]

Update: 2021-11-11 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరకంగా ఇది తనకు చివరి ఎన్నికలు అని ఆయన భావిస్తున్నారు. ఈసారి ప్రజలు తన నాయకత్వాన్ని నమ్ముతారని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తనను గెలిపిస్తుందన్న ధీమా చంద్రబాబులో కన్పిస్తుంది. అయితే వైసీపీ అన్ని రకాలుగా బలంగా ఉండటంతో చంద్రబాబు తన ఎత్తుగడలను ఎన్నికలకు ముందు వేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.

బలంగా ఉన్న వైసీపీని…

ఏ రకంగా చూసినా ఏపీలో వైసీపీ బలంగా ఉంది. ఆర్థికంగా, సామాజిక పరంగా దానిని ఢీకొట్టాలంటే చంద్రబాబుకు కొత్త వ్యూహాలు అవసరమవుతాయి. ఈ రెండేళ్ల పాటు ప్రజా సమస్యలపైనే పోరాడాలి. ఇప్పటి వరకూ చంద్రబాబు పార్టీ నేతలపై దాడులు వంటి వాటిపైనే ఎక్కువగా పోరాటం చేశారన్న పేరు తెచ్చుకున్నారు. ప్రజలతో కనెక్ట్ కావాలంటే ఇక వారి సమస్యలపైనే వీధుల్లోకి రావాలని చంద్రబాబు నిర్ణయించారు.

దూరమయిన వర్గాలను…

తమ నుంచి దూరమయిన ఒక్కొక్క సామాజికవర్గాన్ని తిరిగి దక్కేలా వ్యూహరచన చేయనున్నారు. ఈసారి ఎక్కువ మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. బీసీలను తిరిగి తమ వైపు తెచ్చుకుంటే 90 శాతం విజయం సాధించినట్లేనని ఆయన అంటున్నారు. మరోవైపు మేధావులను కూడా చంద్రబాబు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. తాను విమర్శిస్తే ప్రజలు రాజకీయ పరంగానే చూస్తారు కాబట్టి మేధావులు చేత ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలనుకుంటున్నారు.

మేధావులను సమీకరించి…

ఇందుకోసం ప్రాంతాల వారీగా మేధావులు, తటస్థుల మద్దతును కూడగట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి లేకపోవడం, ఆర్థిక పరిస్థితి దిగజారడం, తలసరి అప్పు పెరిగి పోవడం వంటి వాటిపై ప్రజలను చైతన్య వంతులను చేసే బాధ్యతలను వీరికి అప్పగించే యోచనలో ఉన్నారు. దీనివల్ల మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు తమ వైపు చూస్తాయని చంద్రబాబు ఆశిస్తున్నారు. జిల్లాల వారీగా తటస్థులు, మేధావుల జాబితాను రూపొందించాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది.

Tags:    

Similar News