Chandrababu : “కుప్పం” బాబు మనసును మార్చివేసిందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోట ీచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, [more]

Update: 2021-11-03 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోట ీచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, వివిధ డివిజన్లతో పాటు వివిధ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు కూడా ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత అని…

ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషన్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలోని దర్శి, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం, చిత్తూరు జిల్లోని కుప్పం, కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, కడప జిల్లాలోని కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లాలోని పెనుకొండ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మొన్నటి వరకూ అన్నీ బహిష్కరించి….

మొన్నటి వరకూ పరిషత్ ఎన్నికల నుంచి బద్వేలు ఉప ఎన్నిక వరకూ పోటీకి దూరమని ప్రకటించిన చంద్రబాబు ఈ ఎన్నికలకు మాత్రం సిద్ధమని ప్రకటించడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. కుప్పం మున్సిపాలిటీ ఈ ఎన్నికల షెడ్యూల్ లో ఉండటంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నీ బహిష్కరించినట్లు కుప్పం మున్సిపాలిటీని బహిష్కరిస్తే అక్కడ వైసీపీ మరింత బలోపేతం అవుతుందని భావించి చంద్రబాబు అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.

ఈసారి కుప్పం ఉండటంతో….

గతంలో నిధులు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగానే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పుడు పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు యాక్టివ్ అయ్యారు. దీంతో చంద్రబాబు ఆ మున్సిపాలిటీలో ఖర్చు వారే భరిస్తారని, పార్టీ నామమాత్రంగా నిధులు ఇస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు కూడా మున్సిపల్ ఛైర్మన్, మేయర్ అభ్యర్థులే వార్డు సభ్యుల ఎన్నికల ఖర్చు కూడా భరించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబును కుప్పం ఎన్నిక తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసిందనే చెప్పాలి.

Tags:    

Similar News