ఏదైనా ఎన్నికలకు ముందేనట…? ఇప్పుడు కాదట
అనేక మంది నేతలు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. గతంలో తాము వేసిన అడుగులు తప్పేనని అంగీకరిస్తున్నారు. అయితే వీరందరినీ ఇప్పట్లో టీడీపీలో తిరిగి చేర్చుకునే అవకాశాలు [more]
అనేక మంది నేతలు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. గతంలో తాము వేసిన అడుగులు తప్పేనని అంగీకరిస్తున్నారు. అయితే వీరందరినీ ఇప్పట్లో టీడీపీలో తిరిగి చేర్చుకునే అవకాశాలు [more]
అనేక మంది నేతలు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. గతంలో తాము వేసిన అడుగులు తప్పేనని అంగీకరిస్తున్నారు. అయితే వీరందరినీ ఇప్పట్లో టీడీపీలో తిరిగి చేర్చుకునే అవకాశాలు లేవని చంద్రబాబు చెబుతున్నారట. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటుతుంది. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత కొంత పెరుగుతుండటం, టీడీపీ తిరిగి పుంజుకుంటుందన్న సంకేతాలు వెలువడుతుండటంతో పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలు తిరిగి పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారు.
బాగానే మెరుగుపడినా…?
గత రెండు నెలలతో పోల్చుకుంటే టీడీపీ పరిస్థితి చాలా మెరుగుపడిందనే చెప్పాలి. అనేక నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీ పెరిగింది. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు సయితం ఇప్పుడు నడుంబిగించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి వంటి నేతలు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నా ఇప్పడిప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది పార్టీకి సానుకూలత అంశమే. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే పార్టీ జెండాలు కనపడుతున్నాయి.
వెళ్లిపోయిన నేతలను…
వీరితో పాటు పార్టీని గత ఎన్నికలకు ముందు, తర్వాత వెళ్లిపోయిన నేతలు సయితం తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి, పాలపర్తి డేవిడ్ రాజు, కదిరి బాబూరావు, శిద్ధారాఘవరావు వంటి నేతలు సయితం తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు వస్తే పార్టీకి మరింత మైలేజీ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వీరి చేరికలకు ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది.
ఉపయోగమెంత?
ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు ఉండటం, వీరిని చేర్చుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు పార్టీకి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు కూడా టీడీపీ లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు ప్రాధాన్యత దక్కకపోవడం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందన్న నమ్మకం లేకపోవడంతో వీరు టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెబుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.