జగన్ ను గెలవాలంటే ఇలాగే చేయాలట

చంద్రబాబు ప్రవాసంలో ఉన్నారు. నాన్ రెసిడెంట్ ఏపీ అని వైసీపీ తీసిపారేయవచ్చు కాక. కానీ చంద్రబాబు మాత్రం సదా ఏపీ గురించే ఆలోచిస్తారు. ఆయన మనసు అంతా [more]

Update: 2021-09-15 03:30 GMT

చంద్రబాబు ప్రవాసంలో ఉన్నారు. నాన్ రెసిడెంట్ ఏపీ అని వైసీపీ తీసిపారేయవచ్చు కాక. కానీ చంద్రబాబు మాత్రం సదా ఏపీ గురించే ఆలోచిస్తారు. ఆయన మనసు అంతా ఏపీ రాజకీయంతోనే నిండిపోయి ఉంటుంది. ఎక్కడ భాగ్యనగరంలో బహుళంతస్తుల మేడలో బాబు పడక్కుర్చీలో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటే మాత్రం వైసీపీ పొరపాటు పడినట్లే. చంద్రబాబు దగ్గర ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆయన వ్యూహాలకు బేజారు కావాల్సిదే. ఇపుడు చంద్రబాబు అలాంటి సరికొత్త పధకానికి పదును పెడుతున్నారు.

జగన్ బలాన్ని అలా….

ఏపీలో ఎవరికీ తెలియని రహస్యాలు ఒక్క చంద్రబాబుకే తెలుసు అంటారు. జగన్ కి తెలియని ఆయన రాజకీయం బాబుకు పక్కాగా తెలుసు అని కూడా చెబుతారు. జగన్ బలం ఏంటి అన్నది బాబుకు ఉన్నంత అవగాహ‌న మరెవరికీ లేదు అనే చెప్పాలి. ఆ బలాన్ని తగ్గించడమే ఇపుడు చంద్రబాబు చేస్తున్న పని గత ఎన్నికల్లో జగన్ కి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కింది. ఇపుడు ఆ మద్దతుని వారి నుంచి వేరు చేయడమే చంద్రబాబు మార్క్ అజెండా. దానికోసమే ఆయన నిరంతర పరిశ్రమ చేస్తున్నారు.

కూటమి కట్టేందుకు….

ఏపీలో కొత్త కూటమి తెర పైకి వస్తోందిట. అదెలా అంటే జనసేనాని పవన్ కళ్యాణ్, వామపక్షాలు టీడీపీలతో కలిపిన కూటమిట. ఇందులో బీజేపీ లేకపోవడం వింతే మరి. అయితే చంద్రబాబు దీన్ని ఎన్నికలకు ఆరు నెలల ముందు తీసుకువస్తారు. బాబు మనసులో ఉన్న నిజమైన కూటమి ఇదేనట‌. మరి బాబు బీజేపీ వెంట పడుతున్నారు అన్న చర్చ వస్తోంది కదా అంటే అదంతా మోడీ టీమ్ కన్నెర్ర నుంచి తప్పించుకోవడానికే తప్ప మరేమీ కాదుట. 2024 ఎన్నికల్లో మోడీ ఓడిపోతారని, బీజేపీ వాడిపోతుందని చంద్రబాబు కచ్చితంగా అంచనా వేస్తున్నారుట. కేంద్రంలో కొత్త ఫ్రంట్ అధికారం చేపడుతుందని కూడా లెక్కలు వేస్తున్నారుట. అందుకే ఇప్పటి నుంచే ఏపీలో ఆ కూటమికి తానూ రెడీ చేయడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారుట.

ఓకే కానీ….

ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీకి ఎడం పాటిస్తున్నారు. ఆయన కమలం పార్టీ నేతలతో భుజం భుజం కలిపి ముందుకు సాగడంలేదు. మరో వైపు వామపక్షాలలో సీపీఐ టీడీపీతోనే ఉంటోంది సీపీఏం మాత్రం తటస్థంగా ఉంటోంది. అయితే బీజేపీని వేరు చేయడానికి ఆ పార్టీ కూడా చంద్రబాబు ఏపీలో ఏర్పాటు చేసే కూటమిలో చేరవచ్చు అంటున్నారు. ఇలా ఈ కూటమి కనుక రెడీ అయితే జగన్ ని పూర్తిగా ఏపీలో ఎదుర్కోవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందిట. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉండబోతోంది అంటున్నారు. అదేంటి అంటే కాంగ్రెస్. 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ ని కూడా ఈ కూటమిలో చేర్చుకోవడానికి చంద్రబాబు రెడీగానే ఉంటారని అంటున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉంటే జగన్ ఓట్లను మరింతంగా చీల్చవచ్చు అన్నదే బాబు మార్క్ ఎత్తుగడ. అంటే 2024లో ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పటి నుంచే చంద్రబాబు చూసేశారు అన్నదే బోధపడుతున్నవిషయం. చూడాలి మరి జగన్ ఒంటరి పోరులో ఎలా నెగ్గుతారో.

Tags:    

Similar News