Chandrababu : జాలి పడాలా? జాగ్రత్త అనుకోవాలా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ముగిసింది. ఆయన కుప్పం మున్సిపాలిటీని గెలిపించుకోవడానికి రెండు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. కుప్పం మున్సిపాలిటీకి త్వరలో [more]

Update: 2021-10-31 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ముగిసింది. ఆయన కుప్పం మున్సిపాలిటీని గెలిపించుకోవడానికి రెండు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. కుప్పం మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం చంద్రబాబు ఇంటింటి ప్రచారం చేయడం విశేషం. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మున్సిపాలిటీ ప్రచారానికి, అదీ ఇంటింటికి తిరగడం చర్చనీయాంశమైంది.

తన ఎన్నికల్లోనూ….

నిజానికి చంద్రబాబు తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికే రారు. తాను రాకపోయినా కుప్పం నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటారని ఆయన నమ్మకం. గత ఏడుసార్లుగా అదే జరుగుతుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం చేసి వెళ్లిపోయేవారు. స్థానిక పార్టీ నేతలే అన్నీ దగ్గరుండి చూసుకునే వారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ తగ్గడంతోనే వైసీపీ కుప్పం పై ఫోకస్ పెంచింది.

స్థానిక ఎన్నికల్లో….

దీంతో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ విజయం సాధించలేదు. చివరకు సర్పంచ్ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో చంద్రబాబుకు కుప్పం తేడా కొడుతున్నట్లు స్పష‌మయింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని గెలిపించాలన్న నిర్ణయంతో చంద్రబాబు ఉన్నారు. ఈ మున్సిపాలిటీ గెలుచుకుంటే రాష్ట్రమంతటా గెలుచుకున్నట్లే అన్న ధోరణిలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు.

ఇంటింటి ప్రచారం….

అందుకే చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. అవసరమైన ఆర్థిక సాయాన్ని పార్టీ అందిస్తుందని భరోసా ఇచ్చి వారిలో చంద్రబాబు జోష్ నింపారు. ఇలా కేవలం ఒక్క మున్సిపాలిటీ లో విజయం కోసం చంద్రబాబు ఇంటింట ప్రచారం చేయడం టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. బాబును జగన్ కుప్పానికే పరిమితం చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News