భయమేల బాబూ…?
రాజకీయాల్లో పట్టు విడుపులు కామన్. ప్రతిచోటా ఒకే పట్టు పట్టుకుని కూర్చుంటానంటే ప్రస్తుత రాజకీయాల్లో వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. తాజాగా ఇదే విషయంపై టీడీపీలో తర్జన [more]
రాజకీయాల్లో పట్టు విడుపులు కామన్. ప్రతిచోటా ఒకే పట్టు పట్టుకుని కూర్చుంటానంటే ప్రస్తుత రాజకీయాల్లో వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. తాజాగా ఇదే విషయంపై టీడీపీలో తర్జన [more]
రాజకీయాల్లో పట్టు విడుపులు కామన్. ప్రతిచోటా ఒకే పట్టు పట్టుకుని కూర్చుంటానంటే ప్రస్తుత రాజకీయాల్లో వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. తాజాగా ఇదే విషయంపై టీడీపీలో తర్జన భర్జన జరుగుతోంది. రాష్ట్రంలో విపక్షం వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కత్తి దాడి ఘటన విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై నాయ కులు వెనుకా ముందు ఆడుతున్నారు. ఇది రాజకీయంగా సెగలు పొగలు కక్కుతోంది. విశాఖలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే చంద్రబాబు సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నారు. అయితే, బాబుపై నమ్మకం లేదంటూ.. వైసీపీ నాయకులు కేంద్రాన్ని ఆశ్రయించారు. కేంద్ర హోం శాఖ వెంటనే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.
అప్పట్లో ఆ మాట….
దీంతో విషయం కాస్తా ఇప్పుడు ఎన్ ఐఏ పరిధిలోకి వెళ్లింది. అధికారులు కూడా విశాఖ వచ్చి విచారణ ప్రారంభించారు. కేసును విజయవాడకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అయితే, ఈ విషయంలో కేంద్ర అత్యుత్సాహం చూపించిందని, రా ష్ట్ర పరిధిలోని విషయాలను కూడా కేంద్రం గుంజుకుంటోందని, దీనిపై పోరాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నా రు. అయితే, దీనిపై టీడీపీలోనే భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు రాష్ట్ర పరిధిలో లేదని, దీనిపై ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే.. బాధ్యత వహించాల్సి వస్తే..కేంద్రమే చెప్పాలని చంద్రబాబు చెప్పారు. తీరా ఇప్పుడు నిగ్గు తేల్చేందుకు కేంద్రమేరంగంలోకి దిగితే.. బాబు ఇలా అడ్డు పుల్ల వేయడంపై పార్టీలోని సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరు చేస్తే ఏంటి?
ఇక, వైసీపీ కూడా చంద్రబాబు ఇలా ఎన్ ఐఏకి సహకరించకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. టీడీపీ ప్రమేయం లేనప్పుడు, ఆ పార్టీ నేతలు తప్పు చేయనప్పుడు ఎవరు ఈ కేసును పరిశోధిస్తే మాత్రం బాబుకు అడ్డు ఏంటి? నిజానిజా లు వెలుగులోకి వస్తే.. ఆయనకే మంచిదే కదా? ఇప్పటి వరకు రాష్ట్ర అధికారులు చేసిన విచారణకు కేంద్రంలోని అధికారులు కూడా పచ్చజెండా ఊపితే. ఇది బాబుకు మరింత బలం చేకూరుస్తుంది కదా? అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోడికత్తి కేసులో బాబు పట్టు విడుపులు ప్రదర్శించడమే మంచిదనే అభిప్రాయాలు బాగా వినిపిస్తున్నాయి. కొన్ని కొన్ని ఎదురు తిరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో బాబు ఈ విషయాన్ని కేంద్రానికి వదిలేసి.. తాను తప్పుకోవడమే మంచిదని అంటున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.