వేణుకు గ్రిప్ పెరుగుతోందా?

రామచంద్రాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వైసీపీలో ప్రస్తుతం మూడు గ్రూపులున్నాయి. ఉద్దండులైన నేతలందరూ వైసీపీలో ఉండటంతో ఇక్కడ టీడీపీ లేదనే చెప్పుకోవాలి. రామచంద్రాపురం నియోజకవర్గానికి [more]

Update: 2020-10-20 12:30 GMT

రామచంద్రాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వైసీపీలో ప్రస్తుతం మూడు గ్రూపులున్నాయి. ఉద్దండులైన నేతలందరూ వైసీపీలో ఉండటంతో ఇక్కడ టీడీపీ లేదనే చెప్పుకోవాలి. రామచంద్రాపురం నియోజకవర్గానికి దాదాపు ఎనిమిది నెలల నుంచి పార్టీ ఇన్ ఛార్జి లేరంటే ఆ పార్టీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక బలమైన నేతలున్న వైసీపీలో మాత్రం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కొంత ముందంజలో ఉన్నారట.

మూడు గ్రూపులు…..

రామచంద్రాపురం నియోజకవర్గంలో గత ఎన్నికలలో వైసీపీ నుంచి చెల్లుబోయిన గోపాల కృష్ణ, టీడీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేశారు. చెల్లుబోయిన గెలిచారు. ఇదే నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బోసును ప్రస్తుతం రాజ్యసభకు పంపినా ఆయన దృష్టంతా నియోజకవర్గంపైనే ఉంది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు.

కాపు వర్సెస్ శెట్టిబలిజ…..

రామచంద్రాపురం నియోజకవర్గంలో తొలి నుంచి కాపు వర్సెస్ శెట్టిబలిజ ల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. చెల్లుబోయిన గోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులకు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తోట త్రిమూర్తులు కూడా రామచంద్రాపురం నియోజకవర్గంపైనే దృష్టిపెట్టారు.

మంత్రి అయిన తర్వాత…..

అయితే అనుకోని పరిస్థితుల్లో మంత్రి అయిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టారు. తోట త్రిమూర్తుల చేరికను వ్యతిరేకిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలను సముదాయిస్తూ కాపు, శెట్టిబలిజ, ఎస్సీ ఓటర్లను కలుపుకుని పోయేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తన గ్రిప్ ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఎన్నికల నాటికి ఎవరి బలం ఎంత అనేది చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News