రేసులో ముందున్నా కుల‌మే అడ్డంకి

వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల విష‌యం ఆస‌క్తిగా మారింది. త్వర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని సీఎం జ‌గ‌న్ విస్తరించ‌నున్న నేపథ్యంలో ఎవ‌రికి వారు ఆయా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ [more]

Update: 2021-01-02 05:00 GMT

వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల విష‌యం ఆస‌క్తిగా మారింది. త్వర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని సీఎం జ‌గ‌న్ విస్తరించ‌నున్న నేపథ్యంలో ఎవ‌రికి వారు ఆయా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ త‌మ పంథాల్లో ప్రయ‌త్నాలు కూడా సాగిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌పై ప్రశంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎవ‌రు ఎలా ప్రయ‌త్నాలు చేసినా.. చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి.. ఎలాంటి ప్రయ‌త్నాలూ చేయ‌డం లేదు. మ‌రి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విపై మోజు లేదా ? అంటే.. ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. ఆయ‌న‌కు కూడా ఉంది. అయినా.. ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. కానీ, ఆయ‌న గురించి పార్టీలో జ‌రుగుతున్న కామెంట్లు ఏంటంటే.. ఆయ‌న సంపూర్ణంగా మంత్రి ప‌ద‌వికి అర్హుడ‌ని.

మాస్ నేతగా….

నిజమే.. పార్టీలో ఎంతో మంది నాయ‌కులు ఉన్నా.. వ‌రుస విజ‌యాలు సాధించ‌డంలోను.. ప్రతిప‌క్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంలోను, గ‌త 2014-19 మ‌ధ్య ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదిక‌గా తొడ‌గొట్టి మ‌రీ టీడీపీ నేత‌ల‌కు స‌వాళ్లు రువ్విన విష‌యంలోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందున్నారు. సై అంటే సై అని టీడీపీపై విరుచుకుప‌డ్డారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌లకు ఆయ‌న ఎక్కడ ఉన్నా.. అందుబాటులో ఉండే వ్యవ‌స్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజ‌లు ఏ స‌మ‌స్య చెప్పినా.. వెంట‌నే స్పందించ‌డం, ఉద్యోగుల‌కు పండ‌గ‌ల‌కు న‌జ‌రానా ఇవ్వడం.. స‌మ‌స్యల‌ను వెంట‌నే ప‌రిష్కరించ‌డం మాస్ నేత‌గా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు.

సేవా కార్యక్రమాాలు నిర్వహిస్తూ…..

ఇక‌, క‌రోనా స‌మ‌యంలో అంద‌రిక‌న్నా ముందుగానే స్పందించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప్రతి గ్రామానికీ శానిటైజ‌ర్ బాటిళ్లను వేల సంఖ్యలో పంచారు. మాస్కులు పంపిణీ చేశారు. క‌రోనా స‌మ‌యంలో ఉపాధి కోల్పోయిన ప్రజ‌ల‌కు నిధుల సాయం కూడా చేశారు. ఇక‌, ఇటీవ‌ల నివ‌ర్ తుఫానుకు ఇబ్బందులు ప‌డిన రైతుల‌కు కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం చేశారు. ఇక‌, రాజ‌కీయంగా చూసుకుంటే సొంత పార్టీలో ఆయ‌న‌కు శ‌త్రువులు అంటూ ఎవ‌రూ లేరు. అందరితోనూ ఆయ‌న క‌లివిడిగా ఉంటున్నారు. పైగా సీఎం జ‌గ‌న్‌కు చెవిరెడ్డి అన్నా.. చెవిరెడ్డికి జ‌గ‌న్ అన్నా.. అభిమానాలు ఉన్నాయి.

సాధ్యం కాదని తెలిసి……

మ‌రి ఇన్ని ఉన్నా.. జ‌గ‌న్ ద‌గ్గర , ప్రజ‌ల ద‌గ్గర మంచి మార్కులు ప‌డుతున్నా.. చెవిరెడ్డి భాస్కర రెడ్డికి మంత్రి ప‌ద‌వి మాత్రం ద‌క్కద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం, ఇప్పటికే చిత్తూరులో పెద్దిరెడ్డి ఉండ‌డంతో ఆయ‌న‌నే కొన‌సాగిస్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బ‌హుశ ఈ విష‌యం తెలిసో.. ఏమో చెవిరెడ్డి కూడా మంత్రి ప‌ద‌వి కోసం ఎక్కడా ట్రై చేయ‌డం లేదు. ఏం చేస్తాం.. అన్ని అర్హత‌లు ఉన్నప్పటికీ.. ఒక్కొక్కసారి టైం క‌లిసి రావాలంటారు క‌దా..! బ‌హుశ చెవిరెడ్డికి అదే క‌లిసిరావ‌డం లేదేమో. ఇక జ‌గ‌న్ కూడా చెవిరెడ్డికి ఇప్పటికే తుడా చైర్మన్‌తో పాటు టీడీపీ బోర్డు స‌భ్యుడు ప‌ద‌వి కూడా ఇవ్వడంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ష్టమే అని వైసీపీ వ‌ర్గాల టాక్‌..?

Tags:    

Similar News