Tamilandu : మరో కిరణ్ బేడీ కానున్నారా?
తమిళనాడులో స్టాలిన్ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వ పధకాలతో, ఆకస్మిక పర్యటనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రజల్లో స్టాలిన్ కు సానుకూలత పెరుగుతోంది. స్టాలిన్ ను భిన్న రాజకీయాలకు [more]
తమిళనాడులో స్టాలిన్ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వ పధకాలతో, ఆకస్మిక పర్యటనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రజల్లో స్టాలిన్ కు సానుకూలత పెరుగుతోంది. స్టాలిన్ ను భిన్న రాజకీయాలకు [more]
తమిళనాడులో స్టాలిన్ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వ పధకాలతో, ఆకస్మిక పర్యటనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రజల్లో స్టాలిన్ కు సానుకూలత పెరుగుతోంది. స్టాలిన్ ను భిన్న రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. దీంతో విపక్షాలు సయితం స్టాలిన్ పాలనదక్షతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి స్టాలిన్ ను కట్టడి చేయాలన్నది కమలం పార్టీ వ్యూహంగా ఉంది.
పార్లమెంటు ఎన్నికలకు ముందే…..
తమిళనాడులో మొత్తం 39 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లోనే డీఎంకే పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణాదిలో కర్ణాటక తప్ప బీజేపీకి ఎక్కడా అవకాశం లేదు. తమిళనాడులో అన్నాడీఎంకే కోలుకోలేని పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా స్టాలిన్ ను కొంత కంట్రోల్ చేయాలన్న యోచనలో బీజేపీ ఉంది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది.
పుదుచ్చేరిలోనే….
గతంలో పుదుచ్చేరిలో నారాయణస్వామి అప్పటి గవర్నర్ కిరణ్ బేడీతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆయన పాలనను కూడా సరిగా చేయలేదు. ఢిల్లీ వెళ్లి గవర్నర్ పై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అయినా కిరణ్ బేడీ తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. పైగా ప్రభుత్వ పథకాలను గవర్నర్ సమీక్ష చేశారు. అధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకుని నారాయణస్వామిని ఇబ్బంది పెట్టారు. చివరకు ఆయన కోర్టుకు వెళ్లినా ఫలితం లేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పుదుచ్చేరిలో ఓటమి పాలయింది. ఇప్పుడు స్టాలిన్ పై కూడా అలాగే ప్రయోగాన్ని ప్రారంభిస్తుంది.
గవర్నర్ ద్వారా…
స్టాలిన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వివరణ కావాలని గవర్నర్ ఆర్ ఎస్ రవి కోరారు. శాఖల వారీగా సమీక్షకు గవర్నర్ సిద్ధమవుతున్నారు. గవర్నర్ గా బాధ్యతలను చేపట్టిన వారంలోపే ఈ నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారింది. కేంద్రం ఆడుతున్న నాటకమేనని డీఎంకే నేతలు అంటున్నారు. స్టాలిన్ ను గవర్నర్ చేత చికాకుపెట్టి ఢిల్లీకి తమ వద్దకు రప్పించుకోవాలన్న ప్లాన్ లోనే గవర్నర్ ను రంగంలోకి దింపిందన్న అనుమానాలున్నాయి. ఆర్ఎస్ రవి కూడా కిరణ్ బేడీ మాదిరిగానే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కావడం విశేషం.