ఎంపీల్లో స‌గం మంది అసెంబ్లీకే.. రీజ‌న్ ఇదే

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ప్రస్తుతం ఉన్న నాయకుల పీఠాలు మారిపోతాయా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. [more]

Update: 2021-05-22 13:30 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ప్రస్తుతం ఉన్న నాయకుల పీఠాలు మారిపోతాయా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం వైసీపీకి 22 మంది ఎంపీలు (లోక్‌స‌భ‌) ఉన్నారు. వీరిలో ఒక‌రు నిన్నగాక మొన్న తిరుప‌తి నుంచి గెలిచిన గురుమూర్తిని ప‌క్కన పెడితే.. 21 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును కూడా ప‌క్క‌న పెడితే.. మిగిలిన 20 మంది ప‌నితీరును సీఎం జ‌గ‌న్ చాలా నిశితంగా గమ‌నిస్తున్నారు. ఎవ‌రు ఎలా ప‌నిచే స్తున్నారు? పార్లమెంటులోను, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎలా ముందుకు సాగుతున్నారు ? అనే విష‌యాల‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.

నలుగురికి మాత్రం…?

ఈ క్రమంలో కొంద‌రు వైసీపీ ఎంపీల‌ను ప‌క్కన పెట్టడంతోపాటు.. స‌గం మందికి పార్లమెంటు స్థానాల‌కు బ‌దులు.. అసెంబ్లీకి తీసుకురావాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో యాక్టివ్‌గా ఉన్నవారిలో.. స‌గం మందిక‌న్నా త‌క్కువ‌.. అంటే.. సుమారు ఏడుగురు మాత్రమే ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరిని అలానే కొన‌సాగించ‌నున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వీరికి టికెట్లు ఇస్తారు. ఇక‌, మ‌రో న‌లుగురు మాత్రం అస‌లు యాక్టివ్‌గా లేర‌ని.. పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. వీరికి టికెట్లు ఇచ్చే వ‌ర‌కు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సందేహ‌మేన‌ని అంటున్నారు.

వీరిని అసెంబ్లీకి….

ఇక‌, పార్లమెంటుకు వెళ్లి కూడా అడ‌పాద‌డ‌పా మాట్టాడుతున్న వైసీపీ ఎంపీలలో ముఖ్యంగా త‌న‌కు అత్యంత ముఖ్యులుగా ఉన్నవారిని అసెంబ్లీకి తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, అర‌కు ఎంపీ గొట్టేటి మాధ‌వి.. ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ , న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ‌రాయులు, రాజ‌మండ్రి ఎంపీ భ‌ర‌త్.. వంటి యువ నాయ‌కుల‌ను అసెంబ్లీకి తీసుకువ‌చ్చి.. అదే స‌మ‌యంలో కొంద‌రిని పూర్తిగా పార్టీకే ప‌రిమితం చేయాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీల్లో స‌గం మంది రాష్ట్రానికే ప‌రిమితం అవుతార‌ని తెలుస్తోంది.

గతంలోనూ ఇలాగే..?

దీనికి ప్రధాన కార‌ణం.. పార్లమెంటులో వాయిస్ వినిపించ‌లేక పోవ‌డం.. రాష్ట్రంలో అయితే.. వీరి ప‌నితీరును బాగా వినియోగించుకునే అవ‌కాశం ఉండ‌డం వంటి విష‌యాల‌ను జ‌గ‌న్ యోచిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ మార్పుల‌కు ఎంపీలు ఏమంటారో చూడాలి. ఇప్పటికైతే.. దీనిపై వైసీపీలో జోరుగానే చ‌ర్చ సాగుతోంది. గ‌తంలోనూ కొంద‌రు ఎంపీ అభ్యర్థుల‌ను(పార్టీ మారి వ‌చ్చిన అవంతి శ్రీనివాస్ ) ఎమ్మెల్యేలుగా చేసుకుని మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చిన హిస్టరీ ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News