అయోమయంలో చినరాజప్ప రాజకీయం ?
టీడీపీనే నమ్ముకుని దశాబ్దాల కాలంగా రాజకీయం చేస్తున్న వీర విధేయుడు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఆయన విశ్వాసానికి ప్రతిఫలంగానే 2014 ఎన్నికల తరువాత టీడీపీ [more]
టీడీపీనే నమ్ముకుని దశాబ్దాల కాలంగా రాజకీయం చేస్తున్న వీర విధేయుడు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఆయన విశ్వాసానికి ప్రతిఫలంగానే 2014 ఎన్నికల తరువాత టీడీపీ [more]
టీడీపీనే నమ్ముకుని దశాబ్దాల కాలంగా రాజకీయం చేస్తున్న వీర విధేయుడు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఆయన విశ్వాసానికి ప్రతిఫలంగానే 2014 ఎన్నికల తరువాత టీడీపీ జమానాలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అంతే కాదు ఆయన ఏకంగా చంద్రబాబు తరువాత కీలకమైన శాఖ అయిన హోం విభాగాన్ని చేపట్టారు. అయితే అయిదేళ్ల పాలనలో చినరాజప్ప ఏ విధంగానూ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తనదైన మార్కుని కూడా ఎక్కడా కనబరచలేకపోయారు. ఆయన పేరుకు హోం మంత్రి కానీ అసలు కధ అంతా ప్రభుత్వంలోని పెద్దలే చక్కబెట్టేసేవారు అన్న ప్రచారం కూడా నాడు జరిగింది. ఇక ఒక దశలో చినరాజప్ప తాను కనీసం పోలీస్ కానిస్టేబుల్ ని కూడా బదిలీ చేయించుకోలేని స్థితిలో ఉన్నాను అని నిస్సహాయతను వ్యక్తం చేసిన సంగతి విదితమే. నాడు హోం శాఖను అంతా చినబాబు లోకేషే చక్కపెట్టేసేవారు.
హోంమంత్రిగా ఉన్నా….
ఇక చినరాజప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి విశాఖ జిల్లా టీడీపీ బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఆయన పార్టీని గాడిలో పెట్టలేకపోయారు అన్న విమర్శలూ ఉన్నాయి. ఆయన మాట వినే వారు ఎవరూ లేకపోవడం, సీనియర్లు తన దోవ తమది అన్నట్లుగా ఉండడంతో విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆయన ఇంచార్జి హోదా కూడా వెలవెలపోతోంది. చినరాజప్ప విశాఖ జిల్లాలో ఉన్న ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్యన సయోధ్య కుదర్చలేక చతికిలపడ్డారు అన్నది కూడా విదితమే. ఇక కాపు నేతగా ఉండి వారిని పార్టీ వైపు మర్చలడంలో ఘోరంగా విఫలమయ్యారు.
తిరిగి ఆయనకే…?
ఇదిలా ఉంటే ఏపేలో పాలన అంతా అయోమయంగా ఉందని చినరాజప్ప తాజాగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిరిగి ఆయనకే తిప్పికొడుతున్నారు. చినరాజప్ప రాజకీయమే అయోమయంలో పడిందని వారు అంటున్నారు. ఆయన తన నియోజకవర్గం ప్రజలకు అయిదేళ్ళు మంత్రిగా చేసింది ఏమీ లేదని కూడా వారు అంటున్నారు. మొత్తానికి చినరాజప్ప ధీటైన విమర్శలు చేసే నాయకుడు కాదు అన్నది తెలిసిందే. ఆయన ఏ విమర్శ చేసినా కూడా వైసీపీ లైట్ గానే తీసుకుంటుంది. అంతే కాదు టీడీపీలోనూ ఈ సీనియర్ నాయకుడిని తేలికగా తీసుకోవడమే విశేషం.
సొంత నియోజకవర్గంలో….
ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఒకనాడు టీడీపీ కంచుకోటగా ఉండేది. అలాంటిది ఇపుడు అక్కడ పునాదులు కదులుతున్నాయి. ఇక జిల్లా నిండా టీడీపీలో సీనియర్లు ఉన్నారు. కానీ ఎవరూ పార్టీని పటిష్టం చేయడంలో చురుకుదనం చూపడంలేదు. దాంతో సైకిల్ కి రోజురోజుకూ రిపేర్లు పెరిగిపోతున్నాయి. ఇక చినరాజప్ప సొంత నియోజకవర్గంలో టీడీపీని అభిమానించే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. వాళ్లందరూ చినరాజప్పకు దూరమవుతున్నారు. మళ్లీ పెద్దాపురంలో పోటీ చేస్తే ఓడిస్తామని మరీ శపథాలు చేస్తున్నారు. వారినే అక్కడ సెట్ చేసుకోలేని పరిస్థితి చినరాజప్పది. ఈ నేపధ్యంలో చినరాజప్ప లంటి వారు పెదరాజప్పగా ఎపుడు మారుతారు, పార్టీని ఏ విధంగా పటిష్టం చేస్తారు అన్నదే చూడాలి మరి