అయిదు వేళ్లనూ నాకేసేయాలనేనా?

ఇరుగుపొరుగు దేశాలను తాయిలాల పేరుతో మచ్చిక చేసుకోవడం, లేదా భయపెట్టడం, బెదిరించడం ద్వారా వాటిపై పట్టుసాధించడం, కాలక్రమంలో వాటిని ఆక్రమించడం చైనా నైజం. అందువల్లే ఏ ఇరుగుపొరుగు [more]

Update: 2020-07-07 16:30 GMT

ఇరుగుపొరుగు దేశాలను తాయిలాల పేరుతో మచ్చిక చేసుకోవడం, లేదా భయపెట్టడం, బెదిరించడం ద్వారా వాటిపై పట్టుసాధించడం, కాలక్రమంలో వాటిని ఆక్రమించడం చైనా నైజం. అందువల్లే ఏ ఇరుగుపొరుగు దూశంతో చైనాకు సరిపడదు కానీ ఇటీవల కాలంలో భారత్ పై గుడ్డి వ్యతిరేకతతో రాని సరిహద్దు దేశాలను ప్రలోభపెట్టడం, వాటిని తన వైపునకు తిప్పుకోవడం కోసం చైనా ప్రయత్నిస్తోంది. అంతిమంగా భారత్ ను ఇరుకున పెట్టడం, దక్షిణాసియా లో ఒంటరి చేయడం, ఆ యా దేశాలపై పట్టుసాధించడం చైనా లక్షం. గత కొన్నేళ్ళుగా ఈ లక్షంతోనే పనిచేస్తోంది భారత్ కు ఇరుగు పొరుగున ఉన్న చిన్నదేశాలు నేపాల్, భూటాన్ లను తనవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో నేపాల్ బుట్టలో పడింది. భూటాన్ ఇంకా ఆ దశకు రాలేదు. లడఖ్ తో పాటు భారత్ సరిహద్దు రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కబళించాలన్నది చైనా దురాలోచన. అసలు యావత్ అరుణాచల్ ప్రదేశ్ తమదేనని బీజింగ్ ఎప్పటినుంచో బహిరంగంగా చెబుతోంది. ఇక లడ్డాఖ్ ను ఆక్రమించేందుకు చేస్తున్న కుటిలయత్నాల సంగతి తెలిసిందే. టిబెట్ ను ఎప్పుడో ఆక్రమించుకున్న విషయం విదితమే.

అదే జరిగితే…..

టిబెట్, లడ్డాఖ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భూటాన్ లను ఆక్రమించడం, లేదా వాటిపై పట్టుసాధించడం, లేదా నేపాల్, భూటాన్ లో భారత్ వ్యతిరేకతను రెచ్చకొట్టడం ద్వారా చికాకులు సృష్టించడం దాని ఆలోచన. ఈ విషయంలో కొంతవరకు విజయవంతమైనట్లే అని చెప్పక తప్పదు. టిబెట్, లడ్డాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భుాటాన్ … ఈ ఆరింగిని కలిపి ‘పామ్ ఆఫ్ ఫైవ్ ఫిషర్స్ ‘ అని చైనా వ్యవహరిస్తుంది. పామ్ అంటే అరచేయి. కీలకమైన టిబెట్ ను ఆక్రమించుకోవడం ద్వారా అరచేయిని అందుకుంది. అరచేయికి గల అయిదు వేళ్ళను లడ్డాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భుాటాన్ అని వ్యవహరిస్తుంది. ఈ అయిదింటిని కైవసం చేసుకుంటే దక్షిణాసియాలో బీజింగ్ కు అడ్డేలేదు.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ….

ఈ లక్ష్య సాధనకు చైనా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈశాన్యంలో భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ తనదేనని మెుండిగా వాదిస్తోంది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి, ప్రధాని పర్యటించినప్పుడల్లా అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. తమ భూభాగంపై భారత్ అధినేతలు పర్యటించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో ‘తవాంగ్ ‘ పట్టణం తమదేనని కుాడా ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటోంది. టిబెట్ తమ దేశంలో భాగమని, అందువల్ల అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనని వాదిస్తోంది. అందువల్లే ఈ రాష్ట్రం సమీపంలో గల వాస్తవాధీన రేఖ వద్ద తరచుగా ఘర్షణ పడుతోంది. చొరబాట్లకు పాల్పడటం, కవ్వింపుల కు దిగడం నిత్యకృత్యమైంది.

తిరుగు ఉండదని…

రెండో కీలకప్రాంతం లడ్డాఖ్. దీనిని ఆక్రమించుకుంటే తనకు ఇక తిరుగు ఉండదన్నది బీజింగ్ ఆలోచన . కానీ దానిని కాపాడుకునేందుకు భారత్ గట్లి పట్టుదలతో ఉంది. మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతం లో భారత్ జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక్కడే 20 మంది భారత్ సైనికులు అమరులయ్యారు. భారత్ లోని అతిచిన్న రాష్ట్రమైన సిక్కిం, చైనా భుాటాన్ సరిహద్దుల్లో ఉంది. సిక్కిం భారత్ లో అంతర్బాగమని చైనా ఏనాడో గుర్తించినా ఇప్పటికీ దానిని వివాదాస్పదం చేస్తూనే ఉంది. 2017 జుాన్ లో సిక్కిం సరిహద్దులోని ‘డొక్లం’ వద్ద రహదారి నిర్మాణానికి బీజింగ్ ప్రయత్నించి వివాదాన్ని రాజేసింది. ఇది భుాటాన్ సరిహద్దులో ఉంది. రహదారి నిర్మిస్తే చైనా సైనికుల రాకపోకలు సులభం అవుతాయి. అప్పట్లో దాదాపు 2 నెలల పాటు ప్రష్టంభన కొనసాగింది. భారత్ పట్టుదలతో వ్యవహరించడంలో చివరకు చైనా వెనక్కి తగ్గింది.

అన్నింటిని ఆక్రమించుకుని….

ఇక మిగిలినవి నేపాల్, భూటాన్, ఈ దేశాలతో చైనా, భారత్ సరిహద్దులు పంచుకొంటున్నాయి. ఈ దేశాలు మెుదటి నుంచి భారత్ కు మిత్రదేశాలు. ఇటీవల కాలంలో నేపాల్ ను చైనా తనవై పునకు తిప్పుకుంది. రెండుదేశాల మధ్య దాదాపు 1414 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మెుదట్లో నేపాల్ లో ఒక్క భారత్ రాయభార కార్యాలయం మాత్రమే ఉంది. పదేళ్ళ క్రితం ఖాట్మండు లో చైనా తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇటీవల కాలాపానీ, లిపూల్ ఖ్ తదితర ప్రాంతాలను తనవేనని రచ్చచేసింది. ఈ మేరకు దేశ చిత్రపటం లో చేసిన మార్పులను నేపాల్ పార్లమెంట్ కూడా ఆమెాదించింది. ఈ విషయంలో తెరవెనుక చైనా పాత్ర బహిరంగం. నేపాల్ లో కమ్యునిస్టు నాయకుడు ఖడ్గప్రసాద్ శర్మ ఓలి అధికారంలోకి వచ్చాక అక్కడ చైనా ప్రభావం, భారత్ వ్యతిరేకత అధికమైంది. ఇక మిగిలింది భూటాన్. చైనా, భుాటాన్ మధ్య సుమారు 470 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. భూటాన్ లో కూడా భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి చైనా ప్రయత్నిస్తోంది. ‘డొక్లాంం’ వివాదానికి మూలకారణం భారత్ వ్యతిరేకతే. అరచేయి వంటి టిబెట్ ను ఆక్రమించుకుంది. అరచేతికిగల అయిదు వేళ్ళయిన లడ్డాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భూటాన్ ఆక్రమించుకోవడం ద్వారా దక్షిణాసియాలో భారత్ ను ఊపిరాడకుండా చేయాలన్నది చైనా లక్ష్యం. అందువల్ల భారత్ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయమిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News