చింతమనేని గ్రాఫ్‌ను పనిగట్టుకుని పెంచుతున్నారే..!
కొన్ని పరిణామాలు రాజకీయాలను చిత్రమైన మలుపులు తిప్పుతూ ఉంటాయి. ఇలాంటి పరిణామమే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ [more]
కొన్ని పరిణామాలు రాజకీయాలను చిత్రమైన మలుపులు తిప్పుతూ ఉంటాయి. ఇలాంటి పరిణామమే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ [more]
కొన్ని పరిణామాలు రాజకీయాలను చిత్రమైన మలుపులు తిప్పుతూ ఉంటాయి. ఇలాంటి పరిణామమే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ చోటు చేసుకుందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఆయనపై వ్యక్తిగతంగా అనేక మందికి అక్కసు ఉంది. నోరు విప్పితే.. మాట కుదరదని.. ఎప్పుడు ఏమూడ్‌లో ఉంటారో.. కూడా చెప్పలే మని.. ప్రజలు అదేపనిగా చర్చించుకుంటారు. అదే సమయంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక వివాదాలకు కేంద్రంగా మారారు.
వివాదాలకు కేంద్రంగా….
దీంతో గత ఎన్నికల్లో ఆయనకు వ్యక్తిగత అంశాలే వ్యతిరేకత పెంచి ఓడించాయి. నిజానికి వీటి నుంచి బయటకు వచ్చేందుకు చింతమనేని ప్రభాకర్ ప్రయత్నించనూ లేదు. పైగా.. ఇది ఆయనకు వ్యక్తిగత అంశం కావడంతో.. పార్టీ కూడా పట్టించుకోలేదు. గెలిస్తే.. గెలుస్తాం.. లేకుంటే లేదు అనే తరహాలోనే.. వ్యవహరించింది. పైగా నాడు చింతమనేని ప్రభాకర్ దూకుడు పట్ల చంద్రబాబు సైతం ఉదాసీన వైఖరితో ఉన్నారు. ఇది పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిన అంశాల్లో ఒకటి అయ్యింది.
సింపతీ పెరుగుతుందా?
అయితే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో చింతమనేని ప్రభాకర్ కి సింపతీ పెరుగు తోంది. జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత.. చింతమనేని ప్రభాకర్ పై 36 కేసులు నమోదు చేయడం.. వెంట వెంటనే కేసులతో.. జైలు నుంచి బయటకు కూడా రాకుండా చేయడం.. వంటి పరిణామాలు.. ప్రజల మనసులు తాకుతున్నాయి. తాజాగా.. చింతమనేని ప్రభాకర్ పెట్రో ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటే.. అప్పటికప్పుడు తీసుకుని ఉండాలి.
విశాఖలో అరెస్ట్ చేసి….
కానీ, 24 గంటలు వెయిట్ చేసి.. తర్వాత చింతమనేని ప్రభాకర్ ఎక్కడో విశాఖలోని నర్సీపట్నం వెళ్తే.. అక్కడ పోలీసులకు సమాచారం.. అరెస్టు చేయించారు. అయితే.. ఇదంతా వ్యూహం ప్రకారం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఏదైనా ఉంటే.. అప్పటికప్పుడు కేసు నమోదు చేయాల్సిన పోలీసులు.. తర్వాత స్పందించడం వెనుక.. ఓ సలహాదారు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చింతమనేనిని అనవసరంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ప్రచారం చేశారు.
పనిగట్టుకుని మరీ….
దీనిని ప్రజలు కూడా నమ్ముతుండడంతో.. ఇప్పటి వరకు చింతమనేని ప్రభాకర్ పై ఉన్న విమర్శల కన్నా.. ఈ సింపతీ ఎక్కువగా పనిచేస్తోందని అంటున్నారు పరిశీలకులు. అంటే.. పనిగట్టుకుని.. జగన్ ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్ గ్రాఫ్ పెంచుతోందని అంటున్నారు. మరి ఇప్పటికైనా.. జాగ్రత్త లేకపోతే.. మున్ముందు వైసీపీ పరిస్థితి ఇబ్బందుల్లో పడడం ఖాయమని చెబుతున్నారు.