Ycp : ఈసారి యుద్ధం మామూలుగా ఉండదట

ఏ స్థాయి ఎన్నికలు జరుగుతున్నా ముందుగా చర్చల్లో నిలిచేది దెందులూరు నియోజకవర్గం. అందుకు కారణం చింతమనేని ప్రభాకర్. కాంట్రవర్సీ కింగ్. ఏ చిన్న పంచాయతీ ఎన్నిక జరిగినా [more]

Update: 2021-11-08 06:30 GMT

ఏ స్థాయి ఎన్నికలు జరుగుతున్నా ముందుగా చర్చల్లో నిలిచేది దెందులూరు నియోజకవర్గం. అందుకు కారణం చింతమనేని ప్రభాకర్. కాంట్రవర్సీ కింగ్. ఏ చిన్న పంచాయతీ ఎన్నిక జరిగినా అక్కడ రచ్చ అవ్వాల్సిందే. అందుకే దెందులూరు నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చింతమనేని ప్రభాకర్ ఓడిపోయిన తర్వాత ఆయన తన తీరు మార్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని ఈసారి ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు

సీన్ రివర్స్…

చూశారా.. ఒక్కసారి సీన్ ఎంత రివర్స్ అయిందో.. మొన్నటి వరకూ చింతమనేని ప్రభాకర్ ను ఓడించాలని ప్రత్యర్థులు చూసేవారు. కొన్ని ఎన్నికల పాటు ఆయనకు సరైన ప్రత్యర్థి దొరకలేదు. కానీ 2019 ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి రూపంలో వచ్చి చింతమనేని హవాకు చెక్ పెట్టగలిగింది. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ సాధారణ నేతగా మారిపోయారు. ఆయన నిత్యం జనంలోనే ఉంటున్నారు. మిగిలిన టీడీపీ నేతలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు.

ఇద్దరూ పోటా పోటీగా….

ఆయన ధ్యాసంతా ఒకటే. ఇటు పార్టీ బలోపేతం కావాలి. తాను గెలవాలి. అయితే అబ్బయ్య చౌదరి సయితం దెందులూరు నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించారు. ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలే కావడంతో అబ్బయ్య చౌదరిని అభిమానించి ఆయన వెంట ఉండేవాళ్లు ఎక్కువగా కన్పిస్తున్నారు. ఇతర సామాజికవర్గాల వారు తనను వీడిపోకుండా అబ్బయ్య చౌదరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కోళ్ల పందేల్లా….

అబ్బయ్య చౌదరి ఎన్ఆర్ఐ కావడంతో వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. చింతమనేని కంటే బెటర్ అనిపించుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో దెందులూరులో బిగ్ ఫైట్ ఉండబోతుందంటున్నారు. చింతమనేని గ్రాఫ్ కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఆయనఈసారి గెలుపు అవకాశాలను వదులుకోరు. అబ్యయ్య చౌదరి అంతే. మొత్తం మీద దెందులూరులో ఈసారి పోరు సంక్రాంతి కోళ్ల పందేనికి మించి ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News