కరణాన్ని దూరం పెడతారా? ఆమంచికే అందలమా?

చీరాల వైసీపీ రాజకీయం చివరి దశకు చేరుకున్నట్లే కన్పిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమంచి కృష్ణమోహన్ కే ప్రాధాన్యత ఇవ్వాలని [more]

Update: 2021-02-15 00:30 GMT

చీరాల వైసీపీ రాజకీయం చివరి దశకు చేరుకున్నట్లే కన్పిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమంచి కృష్ణమోహన్ కే ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. చీరాల నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా రెండు గ్రూపుల మధ్య బహిరంగంగానే వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ కార్యక్రమమైనా కరణం బలరాం, ఆమంచి వర్గీయులు బాహాబాహీ తలపడుతున్నారు. ఇప్పటి వరకూ దీనిని అధినాయకత్వం సున్నితంగానే సర్ది చెప్పాలని ప్రయత్నించింది.

చేరిన నాటి నుంచి…..

కరణం బలరాంను పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి విభేదాలు ఎక్కువగా మారాయి. ఇక్కడ టీడీపీ నేతలు కరణం బలరాంతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత మరికొందరు నేతలు వచ్చి చేరడంతో ఆధిపత్య పోరు మొదలయింది. అధికారిక కార్యక్రమాల్లో రెండు వర్గాలూ బాహాబాహా తలపడుతుండటం అధినాయకత్వానికి సమస్యగా మారింది. ఇప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గానికి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో…..

ఆమంచిని తొలుత జగన్ పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా పంపాలనుకున్నారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. ఇటు చీరాలలోనే తన రాజకీయం ఉంటుందని కరణం బలరాం చెబుతున్నారు. ఇద్దరి నేతల మధ్య వైసీపీ క్యాడర్ నలిగిపోతుంది. దీంతో ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా టీడీపీ కంటే రెండు వర్గాల నుంచే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

చీరాలకు ఆమంచినే…..

ఆమంచి కృష్ణమోహన్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కరణం బలరాం ఇటీవలే తన కుమారుడికి వైసీపీ కండువా కప్పారు. కరణం బలరాం కుమారుడు వెంకటేశ్ కు అద్దంకి నియోజకవర్గానికి పంపి, ఆమంచిని చీరాలలోనే కొనసాగించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. అదే నిర్ణయాన్ని ఇద్దరి నేతలకు చెప్పనున్నారట. కరణం కూడా వయసు రీత్యా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనకు ఓకే చెబుతాంటున్నారు. అలా చీరాల వివాదానికి జగన్ చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News