చిరు ఇలాకాలో పవన్ పాచిక పారేనా..!
ఈసారి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ రాజకీయం రసకందాయకంగా సాగనుంది. ఎందుకంటే పొటీ చతుర్ముఖంగా సాగనుండటంతో పాటు అన్ని పార్టీల అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందిన వారే [more]
ఈసారి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ రాజకీయం రసకందాయకంగా సాగనుంది. ఎందుకంటే పొటీ చతుర్ముఖంగా సాగనుండటంతో పాటు అన్ని పార్టీల అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందిన వారే [more]
ఈసారి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ రాజకీయం రసకందాయకంగా సాగనుంది. ఎందుకంటే పొటీ చతుర్ముఖంగా సాగనుండటంతో పాటు అన్ని పార్టీల అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందిన వారే కానుండటం విశేషం. కాపు సామాజికవర్గం అభ్యర్థి కాకుండా ఇతర సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏ పార్టీ ధైర్యం చేయడం లేదు. ఇందుకు ప్రధానంగా సానుకూలంగా ఉన్న సామాజిక ఓటర్ల నుంచి ఇతర పార్టీలకు క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనని పార్టీల్లో భయం పట్టుకుంది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీలకు ఎవరికి వారుగా ఓటుబ్యాంకు కలిగి ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడుకు మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో కూడా పార్టీ చాలా ఓటు బ్యాంకును కలిగి ఉంది. ఇందుకు నిరూపణగా పార్టీ సభ్యత్వాల్లో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
వైసీపీ టిక్కెట్ రేసులో ఇద్దరు
రామనాయుడుపై అసంతృప్తులు ఉన్నా పెద్దగా వ్యతిరేకత లేకపోవడం ఆయనకు కలసి వచ్చే అవకాశం. పార్టీ అధిష్టానం దృష్టిలో ఆయనకు మంచి మార్కులు ఉన్నాయి. ఇక టికెట్ విషయంలో పెద్దగా ఆయనకు పోటీ ఉండకపోచ్చన్నది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటివరకైతే ఆయన టికెట్ రేసులో లీడ్ రోల్‌లో ఉన్నారని చెప్పాలి. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే గుణ్ణం నాగబాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన గత రెండేళ్లుగా ఆయన నియోజకవర్గంలో ప్రజల మధ్యే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో గుణ్ణం నాగబాబుకు మంచి సంబంధాలున్నాయి. ఇటు జగన్ కూడా నాగబాబుపై మంచి అభిప్‌సయాం కలిగి ఉండటంతో టికెట్ విషయంలో ఆయనకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లేనని సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు సైతం టిక్కెట్ ఆశిస్తుండడం… వీరి మధ్య గ్యాప్ వైసీపీకి మైనస్.
బీజేపీ కూడా పోటీ ఇస్తుందా..?
ఇక జనసేన విషయానికి వస్తే చేగొండి సూర్య ప్రకాశ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాపు సామాజికవర్గానికే టికెట్ ఇవ్వాలని పవన్ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఆయనకు పోటీ ఎవరూ ఉండకపోవచ్చన్నది ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఇక బీజేపీ నుంచి డాక్టర్ బాబ్జి సత్యనారాయణమూర్తి(బాబ్జి) బరిలో నిలిచే అవకాశాలున్నాయి. ఈ పార్టీలో పెద్దగా పోటీ లేనప్పటికి ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి పట్టే ఉంది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆయనకు 38 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఈయన బీజేపీలో ఉంటారా ? లేదా ఎన్నికల వేళ ఏ పార్టీలోకి అయినా జంప్ చేస్తారా ? అన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా పాలకొల్లులో మూడు ప్రధాన పార్టీల మధ్య అదిరిపోయే పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో అన్ని పార్టీలు కాపులకే సీట్లు ఇస్తే బీసీ వర్గాల ఓట్లే అభ్యర్థుల విజయవకాశాలను నిర్ణయించనున్నాయన్నది మాత్రం నిర్వివాదాంశం. చూడాలి పార్టీలు ఎలా నిర్ణయం తీసుకుంటాయో…!