చెన్నై దెబ్బకు…చిత్తూరు వణికి పోతోంది
చిత్తూరు జిల్లా కరోనా వైరస్ తో వణికిపోతోంది. తొలినాళ్లలో కొంత ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లా నేడు కరోనా దెబ్బకు అల్లాడి పోతోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి [more]
చిత్తూరు జిల్లా కరోనా వైరస్ తో వణికిపోతోంది. తొలినాళ్లలో కొంత ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లా నేడు కరోనా దెబ్బకు అల్లాడి పోతోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి [more]
చిత్తూరు జిల్లా కరోనా వైరస్ తో వణికిపోతోంది. తొలినాళ్లలో కొంత ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లా నేడు కరోనా దెబ్బకు అల్లాడి పోతోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకూ 131 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. తొలుత మర్కజ్ మసీదు ప్రార్థనలతో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ నెమ్మదిగా శాంతిస్తుందనకుంటున్న దశలో చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి మళ్లీ కరోనా చిత్తూరు జిల్లాను తాకింది.
మర్కజ్ మసీదు ప్రార్థనలతో….
మర్కజ్ మసీదు ప్రార్థనలతో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో శ్రీకాళహస్తిని కొద్దిరోజుల పాటు షట్ డౌన్ చేశారు. మొన్నటి వరకూ జిల్లాలో 80 కేసులు మాత్రమే ఉండేవి. వీరు మర్కజ్ ప్రార్థనలతో లింక్ ఉన్నవారు. వీరిందరికీ చికిత్స అందించడంతో దాదాపు 90 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాకరంగా మారిన శ్రీకాళహస్తి సయితం కొంత కంట్రోల్ లోకి వచ్చింది.
కోయంబేడు మార్కెట్ నుంచి…
అయితే తాజాగా చెన్నైలోని కోయంబేడు మార్కెట్ నుంచి కరోనా వైరస్ చిత్తూరును తాకింది. నిన్న 11 కేసులు, నేడు 10 కేసులు కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారికే ఉండటంతో అధికారులు అందరినీ ఐసొలేషన్ కు పంపారు. తాజాగా పది కేసులు చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో తొమ్మిది, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి మొత్తం ఇరవై కేసులు కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారి నుంచే రావడంతో అక్కడకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది అధికార యంత్రాంగం.
చెన్నై నుంచి రాకపోకలు…..
పొరుగున ఉన్న తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఒక్క చెన్నైలోనే రెండున్నర వేల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కోయంబేడు మార్కెట్ నుంచి సంక్రమించినవేనని అధికారులు గుర్తించారు. సరిహద్దు రాష్ట్రమైన చిత్తూరు జిల్లా నుంచి కూడా కోయంబేడు మార్కెట్ కు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా కరోనా సోకింది. చిత్తూరు జిల్లా నుంచి నిత్యం కొన్ని కూరగాయాలు కోయంబేడు మార్కెట్ కు వెళుతుంటాయి. అక్కడి నుంచి చిత్తూరుకు మరికొన్ని కూరగాయలు వస్తుంటాయి. ఇలా కోయంబేడు మార్కెట్ తో చిత్తూరు జిల్లా కరోనా దెబ్బకు చితికిపోతుందనే చెప్పాలి.