చూస్తూనే ఉండాల్సిందేనా …?

గరుడ పురాణం గా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ గా మారాడు నటుడు శివాజీ. రాజకీయ కుట్రల జాతకాలు చెప్పేది తానేనంటూ టివి 9 అండగా ఆవిర్భవించి ఇటు [more]

Update: 2019-05-11 05:00 GMT

గరుడ పురాణం గా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ గా మారాడు నటుడు శివాజీ. రాజకీయ కుట్రల జాతకాలు చెప్పేది తానేనంటూ టివి 9 అండగా ఆవిర్భవించి ఇటు చంద్రబాబుకు మద్దతుగా, జగన్ పార్టీకి, జనసేనకు వ్యతిరేకంగా తన శక్తి మేరకు పరోక్ష ప్రత్యక్ష ప్రచారం సాగించారు. తెలంగాణ లో గులాబీ బాస్ పై కూడా ఈ అతిధి నటుడు సాగించిన ప్రచారం ఏమాత్రం పనికి రాలేదు. ఇక కేంద్రం కుట్ర అంతా తన దగ్గరే ఉందంటూ ఆపరేషన్ గరుడ పేరు చెప్పి ప్రజల్ని పరేషాన్ చేయబోయి తానే పరేషాన్ అయ్యాడు శివాజీ. చివరికి తనను పెంచి పోషించిన స్నేహితుడే కేసుల్లో ఇరుక్కునేలా చేయడంతో అతీగతీలేక అండర్ గ్రౌండ్ కు చేరుకున్నాడు.

అడ్డంగా దొరికేశాడు …

టివి 9 రవి ప్రకాష్ తనకు ఏడాది క్రితం డబ్బు తీసుకుని షేర్ లు అమ్మి షేర్ లు మాత్రం బదలాయించలేదని ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం శివాజీ ని అందరు అనుమానించేలా చేసింది. తనకు రవి ప్రకాష్ నడుమ వివాదం సాగుతున్నట్లు క్రియేట్ చేద్దామనుకుని ఆ వ్యూహంలో తొందరపాటుతో తెల్లకాగితాలపై షేర్ల బదిలీ వ్యవహారం నడిపి రెండో తప్పుగా దొరికాడు శివాజీ. ఇక ఆ షేర్లు బదిలీ గొడవ కు కారణమైన వ్యక్తి నేతృత్వంలో టివి 9 నడవాలంటూ కోర్టు లో వింత వాదన తెచ్చి మరోసారి బుక్ అయ్యాడు.

అందరి జతకాలు చెప్పే….

రాజకీయ పార్టీల జాతకాలు చెప్పే శివాజీ ఇలా అడుగడుగునా టివి 9 యాజమాన్య హక్కుల బదిలీ వివాదంలో ఏదో చేద్దామని అనుకుని ఫోర్జరీ కేసులో నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది. ఇక ఈ వ్యవహారంలో ఇంతకాలం శివాజీని టివి 9 తో పాటు సపోర్ట్ చేసిన టిడిపి మద్దతు ఛానెల్స్ కూడా కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. మొత్తం ఈ వ్యవహారంలో సోషల్ మీడియా లో రవి ప్రకాష్ కు మించి శివాజీ ట్రోల్ కావడం గమనిస్తే ఇక ఆయన పని ముగిసినట్లే అంటున్నారు నెటిజెన్లు. అయితే రాబోయే రోజుల్లో శివాజీ, రవి ప్రకాష్ నడుమ ఎలాంటి కామెడీ సీన్లు ఇంకా చూడాలిసివస్తుందో అని సెటైర్లపై సెటైర్లు విసురుతూనే వున్నారు. చూస్తూనే ఉండాలి మరి వీరిద్దరూ ఇంకా ఎలాంటి సినిమా చూపిస్తారో ఈ ఎపిసోడ్ లో.

Tags:    

Similar News