సచిన్ పైలట్ సాధించిందేమిటి… మళ్లీ మొదలయిందా?

రాజస్థాన్ లో కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంది? ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు, సచిన్ పైలట్ కు మధ్య సయోధ్య కొనసాగుతుందా? అనే డౌట్లు అందరికీ వస్తాయి. [more]

Update: 2020-10-02 18:29 GMT

రాజస్థాన్ లో కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంది? ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు, సచిన్ పైలట్ కు మధ్య సయోధ్య కొనసాగుతుందా? అనే డౌట్లు అందరికీ వస్తాయి. రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితి దాదాపు నెలరోజులకు పైగానే కొనసాగి ఎలాగోలా కాంగ్రెస్ ప్రభుత్వం నిలదొక్కుకుంది. సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ప్రభుత్వం అధికారంలో కొనసాగే వీలు చిక్కింది. అయితే అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిరిందా? అంటే సందేహమేనంటున్నారు.

రాహుల్, ప్రియాంకలతో ……

సచిన్ పైలట్ తన డిమాండ్లను నేరువేర్చుకున్నారా? లేదా? అన్నది పక్కన పెడితే కొంత అశోక్ గెహ్లాత్ ను కంట్రోల్ లో పెట్టగలిగారంటున్నారు. సచిన్ పైలట్ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్న సచిన్ పైలట్ డిమాండ్ ను రాహుల్, ప్రియాంకలు అంగీకరించారు.

వెంటనే సంతృప్తి పర్చినా……

ఇక పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిని కూడా మార్చి సచిన్ పైలట్ ను సంతృప్తి పర్చగలిగారు. అప్పటి వరకూ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి గా ఉన్న అవినాష్ పాండే ను తప్పించగలిగారు. ఆయన స్థానంలో సోనియా కుటుంబానికి అత్యంత విధేయుడైన అజయ్ మాకెన్ ను నియమించుకోగలిగారు. కానీ ఇంత వరకూ సక్సెస్ అయిన సచిన్ పైలట్ ప్రభుత్వం తిరిగి కుదురుకున్న తర్వాత ఆయనతో నడిచిన ఎమ్యెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

వివక్ష ప్రదర్శిస్తున్నారని……

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సచిన్ పైలట్ తో వెళ్లిన ఎమ్మెల్యేల పట్ల కొంత వివక్ష ప్రదర్శిస్తున్నారని తెలిసింది. వారిని వేరుగా చూడటం వంటి వాటిపై సచిన్ పైలెట్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని సమన్వయ కమిటీ ముందు ఉంచాలని సచిన్ పైలట్ భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ లోనే ఉండి పోరాడాలనుకున్న సచిన్ పైలట్ కు మళ్లీ అశోక్ గెహ్లాత్ సెగ పెడుతున్నట్లు చెబుతున్నారు. మరి సచిన్ పైలట్ సాధించిందేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం సెట్ అవ్వడంతో ఇక హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News