ఆయన్ను డామినేట్ చేస్తున్నారా?

క‌ళాపోష‌ణ లేకుంటే..మ‌నిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది- ఇది నిజ‌జీవితంలో.. మ‌రి రాజ‌కీయాల్లోనూ దూకుడు లేక‌పోతే.. పాలిటిక్స్‌తో ప‌నేంట‌ని అనేది స‌ర్వసాధార‌ణం.. అందుకే క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ [more]

Update: 2019-10-20 08:00 GMT

క‌ళాపోష‌ణ లేకుంటే..మ‌నిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది- ఇది నిజ‌జీవితంలో.. మ‌రి రాజ‌కీయాల్లోనూ దూకుడు లేక‌పోతే.. పాలిటిక్స్‌తో ప‌నేంట‌ని అనేది స‌ర్వసాధార‌ణం.. అందుకే క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్, రాజ్యస‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. ఇదే త‌ర‌హాలో దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. పార్టీ ఏదైనా త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కొంత కాలం వ‌ర‌కు కూడా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. జిల్లాలోను, రాష్ట్రంలోనూ కూడా ఆయ‌న దూకుడు ప్రద‌ర్శించారు. పార్టీ అధినేత చంద్రబాబు క‌నుస‌న్నల్లో ఢిల్లీలో ఏపీ డిమాండ్లపై సీఎం రమేష్ గ‌ళం వినిపించారు.

బీజేపీలోకి వెళ్లినా….

ఈ నేప‌థ్యంలోనే రెండో సారి కూడా రాజ్యస‌భ స‌భ్యాత్వాన్ని సీఎం రమేష్ సొంతం చేసుకున్నారు. ఎంద‌రో పోటీ ఉన్నప్ప టికీ.. అటు దూకుడు, ఇటు విమ‌ర్శలు ఎక్కుపెట్టడంలోనూ సీఎం ర‌మేష్ శైలిని గ‌మ‌నించిన చంద్రబాబు ఆయ‌న‌కే ప‌ట్టం క‌ట్టారు. అయితే, అనూహ్య కార‌ణాల‌తో సీఎం ర‌మేష్‌.. స‌హా పార్టీలో కీల‌కనేత కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి స‌హా కొంద‌రు టీడీపీకి రాం రాం చెప్పి బీజేపీలోకి చేరిపోయారు. అయితే, పార్టీ నుంచి న‌లుగురు బీజేపీలోకి వ‌ల‌స‌పోయినా.. దూకుడు ప్రద‌ర్శిస్తున్నారా ? అంటే.. కేవ‌లం సీఎం ర‌మేష్ ఒక్కడే క‌నిపిస్తున్నాడు.

సైలెంట్ గా ఉంటూనే….

కేంద్రంలో మంత్రిగా చేసిన‌ప్పటికీ.. సుజ‌నా పైపైకి ఏదో మేనేజ్ చేస్తున్నాడే త‌ప్ప.. కేంద్రంలో ని బీజేపీ ఏం ఆశించి .. వీరిని పార్టీలోకి ఆహ్వానించిందో.. ఆ మేర‌కు మాత్రం సుజ‌నా స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. ఏదో ఏపీకి వ‌చ్చిన‌ప్పుడు నామ్‌కేవాస్తేగా వైసీపీ, టీడీపీల‌పై విమ‌ర్శలు చేయ‌డం మిన‌హా ఆయ‌న చేస్తున్నది ఏమీ క‌నిపించ‌డం లేదు. ఇక‌, సీఎం ర‌మేష్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న సైలెంట్‌గా ఉంటూనే చేయాల్సిం ది చేస్తున్నాడు. బీజేపీకి రాజ్యస‌భ‌లో సంఖ్యా బ‌లం పెంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ కోరుకుంటున్నది కూడా ఇదే. కొద్ది రోజుల క్రితం రాజ్యస‌భ‌లో ఓటింగ్ జ‌రిగిన‌ప్పుడు బీజేపీకి ఇత‌ర పార్టీల‌కు చెందిన స‌భ్యుల ఓట్లు ఎక్కువ పోల‌య్యేలా చేయ‌డంలో సీఎం రమేష్ కీల‌క పాత్ర పోషించారు.

అంకిత భావంతో…..

తాజాగా సీఎం రమేష్ కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించారు. కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా వెనక సీఎం రమేష్ కీలకంగా వ్యవహరిం చారు. గత కొద్ది రోజులుగా సీఎం రమేష్ ఇదే పనిమీద ఉన్నారు. రామమూర్తి రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. రామమూర్తి రాజీనామాతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం 44కు తగ్గిపోయింది పార్టీ ఏదైనా అంకిత భావంతో కృషి చేస్తున్న సీఎం ర‌మేష్ పై బీజేపీ కూడా సానుకూలంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News