సీఎం రమేష్ ట్యూన్ అయిపోయారే?
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన ఫక్తు బీజేపీనేతలాగానే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన ఫక్తు బీజేపీనేతలాగానే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో [more]
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన ఫక్తు బీజేపీనేతలాగానే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన పనులను కూడా విమర్శిస్తున్నారు. సుజనా చౌదరి వంటి నేతలు సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మౌనంగా ఉంటుంటే, సీఎం రమేష్ మాత్రం కమలంతో బాగా కలసి పోయారు. బీజేపీ లైన్ ను అందిపుచ్చుకుని ముందుకు వెళుతున్నారు. సోము వీర్రాజుతో కలసి ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొని ప్రస్తుత, గత ప్రభుత్వాలను విమర్శించారు.
ఎక్కువగా లాభపడింది….
నిజానికి సుజనా చౌదరి కంటే టీడీపీలో ఎక్కువగా లాభపడింది సీఎం రమేష్ అని అంటారు పార్టీకి చెందిన నేతలందరూ. సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి ఒక్కటే లభించింది. ఇక సీఎం రమేష్ అప్పట్లో చంద్రబాబు వద్ద ఆడింది ఆట పాడింది పాటగా ఉండేదట. పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులన్నింటినీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్ దక్కించుకునేది. దీంతో పాటు చంద్రబాబు రెండోసారి రాజ్యసభ పదవికి సీఎం రమేష్ ను ఎంపిక చేశారు. అంతగా చంద్రబాబుతో సుజనా కంటే సీఎం రమేష్ ఎక్కువ సాన్నిహిత్యంతో ఉండేవారు.
రాజ్యసభ పదవి రెండోసారి…..
ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని 2016లో పార్టీలోకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇప్పించిందీ సీఎం రమేష్ అని అంటారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కూడా సీఎం రమేష్ కనుసన్నల్లోనే జరిగిందంటారు. అలాంటి సీఎం రమేష్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వగానే బీజేపీలో చేరిపోయారు. సీఎం రమేష్ కు మరో నాలుగేళ్ల వరకూ రాజ్యసభ పదవి ఉంది. తెలుగుదేశం పరిస్థితి కూడా ఏపీలో పెద్దగా ఆశాజనకంగా లేదు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ చేస్తున్న నేతలు ఎక్కువయ్యారు.
ఇప్పుడు అంతా కమలమే…..
అందుకనే ఆయన బీజేపీ పాలసీకి వెంటనే ట్యూన్ అయ్యారని చెబుతున్నారు. సుజనా చౌదరికి ఇంకా తెలుగుదేశం వాసనలు పోనప్పటికీ సీఎం రమేష్ మాత్రం త్వరగానే టీడీపీ వాసనలను వదిలించుకున్నారంటున్నారు. తాను టీడీపీలో ఉండగా వాగ్వాదానికి దిగిన జీవీఎల్ నరసింహారావుతో కూడా సీఎం రమేష్ సయోధ్య కుదుర్చుకున్నారు. ఇప్పుడు సీఎం రమేష్ పూర్తిగా కాషాయధారణ చేశారంటున్నారు. మొత్తం మీద తన వ్యాపారాల కోసం కావచ్చు. లేక రాజకీయ భవిష‌్యత్తును ఆలోచించుకుని సీఎం రమేష్ త్వరగానే బీజేపీకి ట్యూన్ అయ్యాడంటున్నారు.