ఎంగేజ్ మెంట్ లోనే….?

సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలు దుబాయ్ లో జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ నేతలు పెద్దయెత్తున హాజరుకావడం చర్చకు దారి తీస్తుంది. అనేక మంది టీడీపీ [more]

Update: 2019-11-26 05:00 GMT

సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలు దుబాయ్ లో జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ నేతలు పెద్దయెత్తున హాజరుకావడం చర్చకు దారి తీస్తుంది. అనేక మంది టీడీపీ నేతలు దుబాయ్ వెళ్లినట్లు చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సీఎం రమేష‌ అక్కడ విడిది ఏర్పాట్లను భారీగానే చేశారు. అయితే నిశ్చితార్థ వేడుకలకు వెళ్లి వస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ అక్కడ పాలిటిక్స్ కు తెరతీస్తారన్న చర్చ జరుగుతోంది.

కొందరు వెళ్లారంటూ…..

ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడులకు వెళ్లారంటున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారు? ఏ పని మీద వెళ్లారన్న దానిపై చంద్రబాబు ప్రత్యేక టీం నిఘా పెట్టిందట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దుబాయ్ వెళ్లారంటున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఈ వేడుకలకు హాజరయ్యారని చర్చ జరుగుతోంది.

గంటాతో పాటు…..

గంటా శ్రీనివాసరావు అంటే ఆయన కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. గంటా తో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సయితం వెళతారన్న ఊహాగానాలు గత కొంతకాలంగా వస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు పార్టీని వీడకపోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన వరసగా జిల్లాలు పర్యటనలు చేస్తూ నాయకత్వంపై నమ్మకం పెంచే యత్నం చేస్తున్నారు.

టచ్ లోకే కాదట….

కానీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకల పార్టీ మారేందుకు వేదికగా మారిందన్న భయం టీడీపీలో పట్టుకుంది. ఎంగేజ్ మెంట్ లోనే సెటిల్ మెంట్ చేసకుని వస్తారని టీడీపీ షేక్ అవుతుంది. అందుకోసమే టీడీపీ సీనియర్ నేత ఒకరికి ఫోన్ లో నిత్యం ఎమ్మెల్యేలను సంప్రదించే పనిని చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్ మెంట్ లోనే మేనేజ్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సుజనా చౌదరి చెప్పినట్లే టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లోకి కాకుండా బీజేపీలో చేరిపోతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News