వీళ్లకు అంత సీనుందా?

సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇప్పుడు హస్తినలో బీజేపీకి అధికార ప్రతినిధులగా మారారు. కేవలం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే వీరు అధికార ప్రతినిధులన్నమాట. ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం పార్టీలో [more]

Update: 2019-08-24 12:30 GMT

సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇప్పుడు హస్తినలో బీజేపీకి అధికార ప్రతినిధులగా మారారు. కేవలం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే వీరు అధికార ప్రతినిధులన్నమాట. ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది. నిన్నగాక మొన్న వచ్చి పార్టీని హైజాక్ చేయాలని చూస్తున్నారని కొందరు కమలం పార్టీనేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు కమలం పార్టీ నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

బిల్డప్ ఇస్తున్నారని….

ిసుజనా చౌదరి, సీఎం రమేష్ లు నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ నేతలు. వీరిద్దరూ చంద్రబాబుకు నమ్మినబంట్లు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి చేతుల మీదుగానే అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు తెలుగుదేశం పార్టీ నడిచింది. అయితే తాజా ఎన్నికల ఫలితాలతో వీరిద్దరూ బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక చేరిన మరుసటి రోజు నుంచే జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మిగిలిన బీజేపీ నేతలకన్నా తామే ఎక్కువన్నట్లు బిల్డప్ లు ఇస్తుండటం కొందరు బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు.

సిద్ధాంతాలు తెలిసినట్లు…

ఇద్దరికీ బీజేపీ సిద్ధాంతాలు తెలియవు. అయినా సరే సీఎం రమేష్ అమెరికాలో జగన్ జ్యోతిప్రజ్వలన చేయకుండా హిందువులను అవమానించారని విమర్శించారు. ఇక సుజనా చౌదరి అయితే కేంద్ర మంత్రుల వద్దకు లాబీయింగ్ చేస్తూ జగన్ సర్కార్ పై ఫిర్యాదు లు చేస్తున్నారు. బీజేపీ అంటే తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నది బీజేపీ నేతల ఆరోపణ. పార్టీ కార్యక్రమాల్లోనూ, వేదికపైనా వీరిద్దరికి ఎక్కువ ప్రయారిటీ లభిస్తుంది. పార్టీ సిద్దాంతాలు, భావజాలం తెలియని వారికి పెద్దపీట వేయడాన్ని కొందరు సహించలేకపోతున్నారు.

కొందరు బీజేపీ నేతలు….

వీరిలో జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటి నేతలు ఉన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారన్నది వీరి ఆరోపణ. మోడీ, బీజేపీని ఎన్నికల సమయంలో దేశమంతా తిరిగి తిట్టిన తిట్టుకుండా తిట్టారు. బీజేపీ కూడా ఎన్నికల ఏడాది ముందు నుంచి పోలవరం, పట్టిసీమ అవినీతి గురించి ప్రశ్నించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ బీజేపీలో కొందరి నేతలకు టార్గెట్ అయ్యారు. త్వరలోనే వీరిద్దరి విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News