పందెంకోళ్లకు అకాడమీ..తెలుసా …!!
క్రీడలకు, కళలకు అకాడామీలు ఉండటం చూస్తూ ఉంటాం, వింటాం. కానీ సంక్రాంతి పండగకు పందాలకు సిద్ధమయ్యే కోడి పుంజులకు అకాడమి అన్నది చిత్రంగా విచిత్రంగా వున్నా నిజం. [more]
క్రీడలకు, కళలకు అకాడామీలు ఉండటం చూస్తూ ఉంటాం, వింటాం. కానీ సంక్రాంతి పండగకు పందాలకు సిద్ధమయ్యే కోడి పుంజులకు అకాడమి అన్నది చిత్రంగా విచిత్రంగా వున్నా నిజం. [more]
క్రీడలకు, కళలకు అకాడామీలు ఉండటం చూస్తూ ఉంటాం, వింటాం. కానీ సంక్రాంతి పండగకు పందాలకు సిద్ధమయ్యే కోడి పుంజులకు అకాడమి అన్నది చిత్రంగా విచిత్రంగా వున్నా నిజం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందాలకు బాగా వున్న నేపథ్యం తో బాటు పందాలు లక్షలు, కోట్ల రూపాయల్లో జరుగుతూ ఉండటంతో పందెం కోడికి పూర్తి శిక్షణ తప్పదు మరి. అందుకే గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపుంజుల అకాడమిలు ఏర్పాటు అయిపోయాయి. వీటిని నిర్వాహకులు భారీ ఖర్చుతో ఏర్పాటు చేస్తారు.
ప్రత్యేక శిక్షకులు… కుక్కుట శాస్త్రం….
ఏ నక్షత్రం కోడిపై ఏ నక్షత్రం కోడి ని పోటీకి దింపాలో కుక్కుట శాస్త్రం ఔపాసన పట్టిన నిపుణులు నిర్ధారిస్తారు. ఈ శాస్త్ర అధ్యయనంలో ఆరితేరిన వారి నేతృత్వంలో అకాడమీలో కాకి, డేగా, నెమలి వంటి అనేక జాతి కోళ్ళు పూర్తిస్థాయి శిక్షణ పొంది పోటీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. వీటికి కొవ్వు పట్టకుండా ఉండేందుకు వేప, జమ ఆకులను తినిపించడంతో బాటు శక్తి బాగా ఉండేందుకు బాదం, పిస్తా, జీడిపప్పులతో బాటు 18 రకాల ధాన్యాలను ఆహారంగా నిపుణులు ఇస్తారు. వీటికోసం అకాడమీలో ఈతకొలనులు ఉంటాయి. అందులో స్విమ్ చేస్తూ అన్ని రకాల శిక్షణలు పొందుతాయి పందెం కోళ్ళు.
కోసా మాంసానికి మంచి డిమాండే …
ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి అనే నానుడి అందరికి తెలిసిందే. అదే రీతిలో పందెంలో వీరస్వర్గం అలంకరించిన కోడికి వుండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ చనిపోయిన కోడిని వేలరూపాయలు వేలంలో పాల్గొని ఆరగించడం కూడా పండుగ సందడిలో స్పెషల్. కోసా మాంసంగా చనిపోయిన కోడి మాంసాన్ని పిలుస్తారు. పందెం పూర్తి అయినవెంటనే మాంస ప్రియులు కొందరు కోసా కోసం కాచుకుని కూర్చుని వుంటారు. ఇలా కోడి పందాల్లో అన్ని ఆసక్తికరమైన అంశాలే.