ఎవరి పనుల్లో వారు బిజీ …??

గోదావరి జిల్లాలు అంటే కోడిపందాలకు ప్రసిద్ధి. సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున పందెం కోళ్ళు బరిలోకి దిగేందుకు సిద్ధం అయిపోయాయి. పందెం రాయుళ్ళు కత్తులు కు [more]

Update: 2019-01-13 00:30 GMT

గోదావరి జిల్లాలు అంటే కోడిపందాలకు ప్రసిద్ధి. సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున పందెం కోళ్ళు బరిలోకి దిగేందుకు సిద్ధం అయిపోయాయి. పందెం రాయుళ్ళు కత్తులు కు పదును పెట్టి రెడీ గా వున్నారు. మరో పక్క కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలను ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వీటిని నిర్వహించడానికి బరులు ముస్తాబు అయిపోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా లో సంక్రాంతి పందాలకు సర్వం సిద్ధం చేసేశారు అక్కడివారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, మెట్ట ప్రాంతాలు సర్వసన్నద్ధం అయిపోయాయి.

పోలీసులు ఈసారి స్ట్రిక్ట్ …?

అవినీతి చుట్టూ సాగే కోడిపందాల నిర్వహణకు సర్కార్ గత నాలుగేళ్లపాటు గేట్లు ఎత్తేసింది. ఒకదశలో చంద్రబాబు కోడిపందాల ను ఆదాయంగా మలుచుకోవడానికి ఆలోచన చేశారు కూడా. సుప్రీం కోర్టు స్థాయిలో వచ్చిన తీర్పుల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గి లోపాయికారీగా చూసి చూడనట్లు పోవాలని పోలీసులకు దిశా నిర్దేశం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది కూడా కోర్ట్ పోలీసులకు చీవాట్లు పెట్టడంతో ఈసారి పందెం రాయుళ్ళకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ నడుం కట్టి హెచ్చరికలు జారీచేసింది.

రహస్య స్థావరాల్లో……

దీంతో పందెం రాయుళ్ళు వర్సెస్ పోలీసులు అన్నట్లు సీన్ మారనున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో టెన్షన్ టెన్షన్ నడుస్తుంది. చాలా చోట్ల రహస్య ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహించుకోవాలని పందెం రాయుళ్ళు తమపనిలో పడ్డారు. పోలీసులు ఈ స్థావరాలు గుర్తించేందుకు పెద్ద ఎత్తున సమాచార సేకరణలో బిజీ అయ్యారు. చూడాలి ఈసారి ఎలాంటి పరిణామాలు నడుస్తాయి మరి.

Tags:    

Similar News