డెప్త్ అనాలిసిస్ అనవసరం

ఢిల్లీలో సామాన్యుడి పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అది కూడా 70 స్థానాల అసెంబ్లీలో 62 స్థానాలు గెలుచుకుంది. ఢిల్లీ “కాస్మోపాలిటన్” నగరం అని చెప్తారు. కానీ, [more]

Update: 2020-02-12 11:00 GMT

ఢిల్లీలో సామాన్యుడి పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అది కూడా 70 స్థానాల అసెంబ్లీలో 62 స్థానాలు గెలుచుకుంది. ఢిల్లీ “కాస్మోపాలిటన్” నగరం అని చెప్తారు. కానీ, అక్కడ కూడా ప్రజలు తమ ప్రాధమిక అవసరాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనేది ఈ ఎన్నిక స్పష్టం చేసింది. విద్య, వైద్యం, విద్యుత్, మంచినీరు, రవాణా… ఇవి ప్రాధమిక అవసరాలు. నిత్యావసరాలు.

నిత్యావసరాల తర్వాతే…

“మతం” అయినా “జాతీయత” అయినా విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి నిత్యావసరాల తర్వాతే. ఈ నిత్యావసరాలను తీర్చకుండా మతం పేరుతోనో, దేశభక్తి పేరుతోనో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవచ్చు అనుకుంటే బొక్కబోర్లా పడాల్సిందే. లేదా ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బుకు ప్రజలు (పార్టీల దృష్టిలో ఓటర్లు) లొంగిపోతారు అనుకోవడం కూడా భ్రమే.

అది కరెక్ట్ కాదని…..

సంక్షేమ పధకాలు ప్రజలను సోమరిపోతుల్ని చేస్తాయి అంటూ మేధావులు చేస్తున్న వాదనలో పసలేదని ఢిల్లీ ఓటర్లు చెప్పేశారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలపై ఈ పాలకుడు దృష్టి పెడతాడో, ఆ పాలకుణ్ణే ప్రజలు ఆదరిస్తారు. ఢిల్లీ మహానగరం కాబట్టి అక్కడ ఉపాధి గురించి పెద్దగా ప్రజలు ఆలోచించకపోవచ్చు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లాంటి ఇతర ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కూడా ఒక ప్రాధాన్యతాంశమే.

అవకాశం వచ్చినప్పుడు……

దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు కాబట్టి ఏ నేత అయితే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తారో, ఆ నేతనే ప్రజలు ఆదరిస్తారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామికీకరణ కూడా ముఖ్యమే. ఈ దిశగా చేపట్టే ప్రతి చర్యలనూ ప్రజలు రాజకీయాలకు, రాజకీయ ప్రచారాలకు అతీతంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అవకాశం (ఎన్నికలు) వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీతో సహా ఇదే తరహా ఆలోచనలు నడుస్తున్నాయి. విద్య, వైద్యం వంటి వాటి తర్వాతే “కులం”, “మతం” “జాతీయత”, “దేశభక్తి” వంటి నినాదాలు ఉపయోగపడతాయి.

 

– దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News