జగన్‌తో కలిసి నడుద్దాం.. కామ్రేడ్ల నిర్ణయం..?
రాష్ట్రంలో కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సీపీఎం మాత్రం చాలా కీలకమైన దిశగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకు జనసేన పార్టీతో కోరి [more]
రాష్ట్రంలో కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సీపీఎం మాత్రం చాలా కీలకమైన దిశగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకు జనసేన పార్టీతో కోరి [more]
రాష్ట్రంలో కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సీపీఎం మాత్రం చాలా కీలకమైన దిశగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకు జనసేన పార్టీతో కోరి చేతులు కలిపిన కమ్యూనిస్టులు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. దీనిపై రేపో మాపో.. జగన్‌తో కలిసి మాట్లాడతారనే ప్రచారం ఒక్కసారిగా వెలుగు చూసింది. వాస్తవానికి కమ్యూనిస్టుల్లో.. సీపీఎం పట్ల జగన్‌కు సానుభూతి ఉంది. గతంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. అనారోగ్యానికి గురైనప్పుడు సీఎంగా ఉన్న జగన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి. అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. ఎన్నికలకు ముందే నాడు చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై వైసీపీ చేసిన పోరాటాలకు సీపీఎం బాగా మద్దతు ఇచ్చింది.
నిన్న మొన్నటి వరకూ…
ఇక, ప్రభుత్వ పరంగా కూడా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. సీపీఎంకు ఒకింత అనుకూలంగానే ఉంటున్నాయి. సర్కారీ ప్రకటనల పరంగా.. సీపీఎం మౌత్ పీస్.. ప్రజాశక్తి పత్రికకు భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తోంది సర్కారు. ఇది ప్రజాశక్తికి నిజంగానే శక్తిని నింపుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీతో లోపాయికారీగా సీపీఎం ఒప్పందాలు చేసుకుందనే ప్రచారం కమ్యూనిస్టుల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే.. ఇప్పుడు అది తెరమీదకి నేరుగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు జనసేన వెంట ఉన్నారు.
ఆచి తూచి…..
ఆ పార్టీతోనే కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇచ్చిన సీట్లు తీసుకున్నారు. కానీ, జనసేనాని పవన్ మాత్రం బీజేపీతో అంటకాగే సరికి.. మాత్రం సీపీఎం తప్పుకొంది. ఇక, అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న సీపీఎం.. ప్రభుత్వంపై ఎక్కడా పెద్ద ఎత్తున దాడులు చేయడం లేదు. విమర్శలు కూడా చేయడం లేదు. రాజధాని విషయంలోనూ ప్రభుత్వంపై ఇతర పార్టీలు, సీపీఐ చేస్తున్న విమర్శలు తెలిసిందే.. కానీ, సీపీఎం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.
మద్దతుదారుగా …….
అయితే, జగన్ కూడా రాష్ట్రంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పార్టీలను లైన్‌లో పెట్టాలంటే.. అంతో ఇంతో చాతుర్యం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సీపీఎంను నేరుగా పార్టీలో చేర్చుకోకపోయినా.. మద్దతుదారుగా ఉంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం అటు కమ్యూనిస్టులు, ఇటు వైసీపీ నేతల మధ్య చర్చగా ఉండడం గమనార్హం.